మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు లబలబ కొట్టుకుంటున్నారు. న్యాయానికి చెల్లుచీటి అని ఈనాడును మూయించేయటమే అసలు అసెండాతో ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటు లబలబ మొత్తుకుంటున్నారు. మార్గదర్శిపై ప్రభుత్వం దాడులు చేయిస్తుంటే బేల ఏడుపులు ఎందుకు ? బేల రాతలు ఎందుకో అర్ధకావటంలేదు. జగన్మోహన్ రెడ్డి-రామోజీల మధ్య యుద్ధం మొదలైంది. రాజకీయంగా జగన్ను నాశనం చేసేయాలని రామోజీ గడచిన 14 ఏళ్ళుగా చేయని ప్రయత్నంలేదు. వార్తలు, కథనాల పేరుతో బురదచల్లని రోజులేదు.
రామోజీ టార్గెట్ ఏమిటి జగన్ను రాజకీయంగా నాశనం చేసి తన కీలుబొమ్మ చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయటమే. ఇందుకోసం రామోజీ అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రయ్యారు. దాన్ని రామోజీ తట్టుకోలేకపోయారు. జగన్ కు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు మొదలుపెట్టారు. అయినా జగన్ పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో రామోజీ తన వ్యతిరేకతను మరింతగా పెంచారు. దాంతో జగన్ కు మండింది.
దశాబ్దాలుగా కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా జరుగుతున్న విచారణలో ప్రభుత్వం కూడా ఇంప్డీడ్ అయ్యింది. అంటే 2006 నుండి మార్గదర్శికి వ్యతిరేకంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న పోరాటానికి జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. దాన్న రామోజీ తట్టుకోలేక తన వ్యతిరేకతను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళారు. అప్పటినుండి జగన్ -రామోజీ మధ్య డైరెక్ట్ ఫైట్ మొదలైంది.
రామోజీ ఆయన కోడలు, సంస్ధ ఎండీ శైలజపై సీఐడీ కేసులు నమోదుచేసి విచారణ మొదలుపెట్టింది. దాన్ని రామోజీ తట్టుకోలేకపోయారు. ఒకసారి నువ్వా నేనా అనే స్ధాయికి చేరుకున్న తర్వాత ఎవరికి అందుబాటులోని ఆయుధాలను వాళ్ళు ప్రయోగించటం మామూలే కదా. ఎదురుతిరిగి జగన్ తన ఆయుధాలను ప్రయోగించేసరికి రామోజీ తట్టుకోలే బేరుమంటున్నారు. దాంతో ఎక్కడలేని ఏడుపులు ఏడుస్తున్నారు. న్యాయం, చట్టాన్ని ప్రభుత్వం యధేచ్చగా ఉల్లంఘిస్తోందంటు ఏడుస్తున్నారు. ప్రభుత్వం మీద బురదచల్లకూడదన్న ఇంగితం రామోజీకి లేనపుడు మార్గదర్శిలో ప్రభుత్వం సోదాలు, విచారణలు చేయకూడదని ఏడుపెందుకు ?