తెలుగుదేశంపార్టీలోని ఇద్దరు ఎంపీల వ్యవహారం చాలా గోలగా తయారైంది. యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర సందర్భంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని గైర్హాజరవ్వటం కలకలంరేపుతోంది.  కేశినేని వ్యవహారం అంటే రోజుకో విధంగా మారుతోంది. మరి జయదేవ్ కు ఏమైంది ? అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. పాదయాత్రలో ఇద్దరు ఎంపీలు పాల్గొనకపోవటం పెద్ద మైనస్ అయిపోయింది. ఈ గోల ఇలాగ ఉండగానే గురువారం కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రం-విక్రయభవనం ప్రారంభం జరిగింది.





దాన్ని ఎంపీ ల్యాడ్ ఫండ్స్ తో నిర్మించారు. ఈ సందర్భంగా పెద్ద కార్యక్రమం జరిగింది. దాని కార్యక్రమానికి వేసిన ఇన్విటేషన్లో కేవలం విజయవాడ ఎంపీ కేశినేని నాని అనిమాత్రమే ఉంది. తెలుగుదేశంపార్టీ అని ఎక్కడా ప్రింట్ చేయలేదు. దీంతోనే ఎంపీ ఉద్దేశ్యం ఏమిటో అందరికీ అర్ధమైపోతోంది. తాను చంద్రబాబునాయుడునే లెక్కచేయటం లేదు ఇక లోకల్ లీడర్లను ఏమి పట్టించుకుంటారు అనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది.





కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేశినేని టీడీపీ తరపున ఎంపీగా పోటీచేస్తారా ? అనే ఒక డౌటుంది. ఇదే సమయంలో అసలు చంద్రబాబు కేశినేనికి టికెట్ ఇస్తారా అనే అనుమానం కూడా పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల సంగతి ఏమోగాని ఇపుడు మాత్రం ఎంపీ పార్టీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలోనే చంద్రబాబుకు బాగా మండిపోతున్నా ఏమీ చేయలేని పరిస్దితులో ఉన్నారు.




కేశినేని వ్యవహారం ఏదో రూపంలో క్లారిటి వస్తోంది. మరి గల్లా పరిస్ధితే ఎవరికీ అర్ధంకావటంలేదు. రాబోయే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేయనని గల్లా ఇప్పటికే చంద్రబాబుకు చెప్పేశారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో పోటీచేయకపోతే పోయారు అప్పటివరకు టీడీపీ ఎంపీగానే ఉండాలి కదా అన్నది తమ్ముళ్ళ వాదన. గల్లా అసలు పార్టీ ఎంపీగా ఉండటానికి కూడా ఇష్టపడటంలేదట. లోకేష్ పాదయాత్ర విషయంలో తాను కామెంట్లు చేశానని జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమే అని ఒక ఖండన ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ పాదయాత్రలో ఎందుకు పాల్గొనలేదని మాత్రం చెప్పలేదు. ఇక్కడే గల్లా వైఖరిపై అందరిలోను అయోమయం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: