మనదేశంలో స్వేచ్చ బాగా ఎక్కువైపోయింది. ఎవరి విషయంలో అయినా సరే ఎవరైనా కానీండి ఎలాంటి సంబంధంలేకపోయినా సరే కేసు దాఖలుచేయచ్చు. దానికి అందమైన పేరు ఏమిటంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ముసుగులో సంబంధంలేకపోయినా సరే ఎవరైనా ఎవరిమీదైనా సరే కేసులు వేసేస్తున్నారు. ఇలా చేయవద్దని సుప్రింకోర్టు, హైకోర్టు పిటీషనర్లను, లాయర్లను ఎన్నిసార్లు హెచ్చరించినా ఉపయోగం కనబడటంలేదు.





ఇపుడు ఇదంతా ఎందుకంటే రాహుల్ గాంధి పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ పునురుద్ధరించటాన్ని సవాలు చేస్తు ఒక లాయర్ కేసు వేశారు. లక్నోకు చెందిన అశోక్ పాండే సుప్రింకోర్టులో ఈ కేసు వేశారు. కేరళలోని వయనాడులో  ఎంపీగా గెలిచిన రాహుల్ సభ్యత్వాన్ని వెంటనే రద్దుచేసేయాలని తన పిటీషన్లో లాయర్ కోరారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాహుల్ గాంధి ప్రాతినిధ్యం వహిస్తున్నది వాయనాడుకు.





పిటీషన్ వేసిన లాయరేమో లక్నోకు చెందిన వ్యక్తి. అంటే రాహుల్ సభ్యత్వంతో లాయర్ కు ఎలాంటి సంబంధంలేదు. లాయర్ కేరళ వ్యక్తి కాదు కదా కనీసం వాయనాడు ఓటరు కూడా కాదు. ఎక్కడో వాయనాడు ఎంపీగా ఉన్న రాహుల్ పార్లమెంటు స్ధానాన్ని వెంటనే రద్దుచేయాలని ఇంకెక్కడో లాయర్ అయిన అశోక్ పాండే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అసలిందులో ప్రజాప్రయోజనం ఏముందో అర్ధంకావటంలేదు.





రాహుల్ ఎంపీగా ఉన్నా సభ్యత్వం రద్దయినా అశోక్ కు కానీ లేదా ఇతర జనాలకు కానీ వచ్చే లాభనష్టాలు ఏమిటో కేసు వేసిన లాయరే చెప్పాలి. రాహుల్ కు సూరత్ కోర్టు విధించిన 2 ఏళ్ళ జైలుశిక్ష చాలా ఎక్కువని సుప్రింకోర్టు అభిప్రాయపడింది. అందుకనే ముందు ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. దాంతో రద్దయిన రాహుల్ ఎంపీ పదవి మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ఈ మొత్తంలో కేసు వేసిన లాయర్  అభ్యంతరం ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇందుకనే ప్రజాప్రయోజన వ్యాజ్యాలంటేనే కోర్టులో మండిపోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: