తాజాగా మార్గదర్శిలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై సీఐడీ ఉన్నతాధికారులు చాలా విషయాలు చెప్పారు. వీళ్ళు చెప్పిందాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఐటి, ఈడీ లకు సమాచారం ఇచ్చామన్నది. మార్గదర్శిలో బ్లాక్ మనీ దందా నడుస్తోందని, అన్ అకౌటెండ్ మనీ వందల కోట్ల రూపాయలు ఉన్నాయని గుర్తించినట్లు సీఐడీ ఉన్నతాధికారులు చెప్పారు. అందుకనే వాటి నిగ్గు తేల్చేందుకు వెంటనే ఐటి, ఈడీలు రంగంలోకి దిగాలని తాము కోరినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.
మార్గదర్శిలో అంతా అక్రమాలే జరుగుతున్నాయని, అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారమే అక్రమమని మొదటినుండి సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆర్బీఐ, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి రామోజీరావు మార్గదర్శి వ్యాపారం చేస్తున్నట్లు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇపుడు సీఐడీ చేస్తున్న ఆరోపణలనే 2006 నుండి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నారు. కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఉండవల్లి ఒక్కళ్ళే పోరాటం చేశారు కాబట్టి రావాల్సినంత కవరేజ్ రాలేదు. ఈమధ్యనే ఉండవల్లి కేసులో ప్రభుత్వం కూడా భాగస్వామి అయ్యింది కాబట్టే దర్యాప్తులో జోరుపెరిగింది.
ఈ నేపధ్యంలోనే ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణతో పాటు బ్రాంచ్ మేనేజర్లపైన కూడా సీఐడీ కేసులు నమోదుచేసి విచారిస్తున్నారు. మార్గదర్శి విషయంలో రామోజీ చాలా మాటలు చెబుతున్నారు కానీ తన వ్యాపారం పలానా నిబంధనల ప్రకారం, పలానా చట్టం ప్రకారమే చేస్తున్నట్లు ఇంతవరకు చెప్పలేదు.
తాజాగా మార్గదర్శిలో బ్లాక్ మనీ ఉందని, సుమారు రు. 800 కోట్ల అనుమానపు నిదులున్నాయని, 3 వేలమంది ఘోస్ట్ చందాదారులున్నారని సీఐడీ ఉన్నతాధికారులు ఆరోపించారు. మరి వీళ్ళ ఆరోపణలకు రామోజీ ఏమి సమాధానం ఇస్తారో చూడాలి. అలాగే అన్నపూర్ణాదేవి అనే చందాదారు తనను మార్గదర్శి మోసంచేసిందని ఆరోపించారు. అయితే ఆమె డిఫాల్టర్ అని రామోజీ అన్నారు. ఇద్దరిలో ఎవరి వాదన నిజం అన్నది తేలాల్సుంది. అందుకనే ఐటి, ఈడీ శాఖల దర్యాప్తును కూడా సీఐడీ కోరింది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.