తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సిఐడి పోలీసులు నిన్న అరెస్టు చేసిన విషయం  తెలిసిందే. అయితే ఈ సందర్భంగా చిన్న చిన్న అల్లర్లు జరిగాయి కానీ శాంతి భద్రతలకు ఆటంకం ఏమి రాలేదు.  కానీ చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా ప్రజలు సంఘీభావంగా  రోడ్డు ఎక్కుతారని, ఆ తర్వాత జరిగే అల్లర్ల కారణంగా శాంతి భద్రతలు కరువవుతాయని వాళ్ళు భావిస్తున్నారు. దాంతో ఆంధ్ర ప్రాంతంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేస్తారని కొందరు భావించారు.


కానీ  చిన్న చిన్న అల్లర్లు, ఆందోళనలు మాత్రమే జరిగాయి. ఆ తర్వాత కోర్టు రిమాండ్‌ విధించడంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలోనూ.. ఆ తర్వాత నంద్యాల నుంచి విజయవాడ తరలించిన సమయంలోనూ పెద్దగా అల్లర్లు జరగలేదన్న వాదన వినిపిస్తోంది. అంతే కాదు.. కోర్టులో వాదనల సమయంలోనూ పెద్దగా రాష్ట్రంలో అల్లర్లు జరగలేదు.


ఒకవేళ బెయిల్ పై గాని, రిమాండ్ పై గాని చంద్రబాబు  బయటికి వస్తే తనకు తాను గానే తనకు న్యాయం చేయమని ఆంధ్ర ప్రజల సమక్షంలో ఆందోళన చేపడతారని తెలుస్తుంది. అదే బెయిల్ రాకపోతే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బిజెపికి సంబంధించిన రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కలుపుకుంటూ వెళ్తారట.


వీళ్ళిద్దరూ ఆందోళనలు సాగిస్తారని, వీరికి తెలుగుదేశం శ్రేణులు కూడా కలిసి వస్తారనే లెక్క నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు గానీ, అలాగే జనసేన గానీ దీని ద్వారా రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయవచ్చని భావిస్తున్నారు. అయితే రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీతో కూడిన కేంద్రం రాష్ట్రపతి పాలనకు సుముఖత చూపించదు అని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూడా రాష్ట్ర పతి పాలనను కోరుకుంటాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP