పార్టీలో విలీనం చేసుకునే విషయమై వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ పక్కనపెట్టేసిందా ? అందుకనే షర్మిల డెడ్ లైన్ పెట్టారా ? తాజా డెవలప్మెంట్లు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లోటస్ పాండ్ లో షర్మిల పార్టీ నేతలతో మాట్లాడుతు విలీనంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అందుకు ఈనెల 30వ తేదీని డెడ్ లైనుగా ప్రకటించారు. 30వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చకపోతే తన నిర్ణయం ప్రకారం తాను ముందుకు వెళిపోతానని కాంగ్రెస్ అధిష్టానానికి అల్టిమేటమ్ జారీచేశారు.





ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్-షర్మిల పార్టీ విలీనం విషయం కొన్ని నెలలుగా సాగుతోంది. ఎక్కడ పీటముడి పడిందో సరిగ్గా తెలీటంలేదు కానీ విషయం అయితే ఒకపట్టాన తేలటంలేదు. కొన్నిసార్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇస్తారని, కర్నాటక నుండి రాజ్యసభ ఎంపీగా పంపుతారని, ఏపీ ఇన్చార్జిని చేస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేయబోతున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. అయితే పై విషయాలను షర్మిల ప్రస్తావించకుండా తనను ఎంపీగా పోటీచేయమని కాంగ్రెస్ అధిష్టానం అడిగినట్లు మాత్రమే చెప్పారు.





తానేమో ఖమ్మంజిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేస్తానని చెప్పారట. మరి ఎంపీగా పోటీచేస్తారా ? లేకపోతే పాలేరుకే పోటీచేస్తారా ? అన్నది చెప్పలేదు. అయితే ఇక్కడ అర్ధం అవుతున్నది ఏమిటంటే ఖమ్మంలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిన తర్వాత షర్మిల పార్టీని విలీనం చేసుకునే విషయం బాగా నెమ్మదించినట్లుంది.





తుమ్మలతో పోల్చుకుంటే షర్మిల నతింగ్ అనే చెప్పాలి. తుమ్మల కూడా పాలేరులో టికెట్ ఇస్తేనే పార్టీలో చేరుతానని షరతు పెట్టారు. ఆ షరతుకు అంగీకరించిన తర్వాతే తుమ్మల పార్టీలో చేరారు. పాలేరు టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం కూడా తుమ్మల వైపే మొగ్గుచూపుతున్నట్లు షర్మిలకు అర్ధమైనట్లుంది. అందుకనే షర్మిలలో అసహనం మొదలైంది. ఏ సంగతి తేల్చకపోతే మొత్తం 119 నియోజకవర్గాలకు పోటీకి రెడీగా ఉన్నట్లు షర్మిల చేసిన ప్రకటన ఉత్త డ్రామా అనే అనుకోవాలి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: