ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం తొందరలోనే నిజమయ్యేట్లుంది. స్కిల్ స్కామ్ లో ఇప్పటికే అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుకు తోడు నారా లోకేష్ కూడా అరెస్టవుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే.  అరెస్టుకు భయపడే లోకేష ఏపీని గడచిన 11 రోజులుగా వదిలేసి ఢిల్లీలో కూర్చున్నట్లు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే సడెన్ డెవలప్మెంట్ చూస్తే లోకేష్ అరెస్టు తప్పదనే అనిపిస్తోంది.





ఎలాగంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంలో లోకేష్ ను సీఐడీ ఏ 14గా ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈ విషయాన్ని కోర్టుకు మెమో రూపంలో సీఐడీ చెప్పింది.  రింగ్ రోడ్డు అలైన్మెంట్ ను సీఆర్డీయే మూడుసార్లు మార్చింది. దీనికి కారణం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లోకేషే అని సీఐడీ గట్టిగా వాదిస్తోంది. ఇందుకు తమ దగ్గర అన్నీ ఆధారాలున్నాయని కోర్టుకు చెప్పింది. మూడుసార్లు అలైన్మెంట్ ను ఎందుకు మార్చారంటే క్విడ్ ప్రో కోలో భాగమేనట. కారణం ఏమిటంటే రియాల్టర్ లింగమనేని రమేష్ భూములు, నారాయణ కొనుగోలు చేసిన భూములతో పాటు హెరిటేజ్ పేరుతో చంద్రబాబు కొన్న భూముల విలువలు పెంచుకునేందుకే అని సీఐడీ చెబుతోంది.





మాస్టర్ ప్లాన్ కు సంబంధంలేకుండా మూడుసార్లు రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులు చేయటానికి సొంతలాభం, క్విడ్ ప్రో కో కు మించిన కారణాలు ఏవీ కనబడటంలేదు. అదే సమయంలో కరకట్టమీద రమేష్ అక్రమ నిర్మాణంలోకి చంద్రబాబు మారారు. అంతకుముందు ఇదే నిర్మాణంతో పాటు మరికొన్నింటిని అక్రమనిర్మాణాలని, వాటిని  కూల్చేస్తామని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.





తర్వాత ఏమైందో ఏమో నోటీసులపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకపోగా అదే అక్రమ నిర్మాణాన్ని  చంద్రబాబు క్యాపాఫీసుగా మార్చుకున్నారు. ఆ అక్రమనిర్మాణం లింగమనేని రమేష్ దే. ఇక్కడే క్విడ్ ప్రో కో స్పష్టంగా కనబడుతోంది. ఇదే అక్రమనిర్మాణాన్ని రమేష్ ప్రభుత్వానికి ఇచ్చేశారని ఒకసారి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అది ప్రైవేటు భవనమని మరోసారి చంద్రబాబు తనిష్టంవచ్చినట్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ప్రకటనల వల్లే చంద్రబాబు-రమేష్ మధ్య ఏదో బంధముందనే ప్రచారం జరిగింది. దాన్నే సీఐడీ క్విడ్ ప్రో కో అని తేల్చింది. మరి ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: