నారా లోకేష్ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. మొదటిరోజు సీఐడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడినపుడు ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో లోకేష్ ను సీఐడీ రెండోరోజు కూడా విచారించింది. ఇదే విషయాన్ని లోకేష్ మాట్లాడుతు 50 ప్రశ్నలు వేస్తే అందులో 49 ప్రశ్నలు రింగ్ రోడ్డుకు సంబంధించినవే కావని చెప్పారు. గూగుల్ సెర్చిలో వెతికినా దొరికే ప్రశ్నలన్నింటినీ తనను అడిగినట్లు ఎద్దేవాచేశారు.
ఇక్కడే ఓవర్ యాక్షన్ బయటపడింది. రింగ్ రోడ్డు స్కామ్ లో విచారణకు పిలిచిన సీఐడీ అధికారులు దానికి సంబంధించిన ప్రశ్నలు అడగకుండా ఇంకేమడుగుతారు. మధ్యలో డైవర్షన్ కోసం సంబంధంలేని ప్రశ్నలు కూడా ఏవన్నా అడిగితే అడగచ్చు. అంతేకానీ 50 ప్రశ్నల్లో 49 ప్రశ్నలు అసలు సంబంధమే లేనివని చెప్పటంలో అర్ధమేలేదు. రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడు సార్లు మార్చటం, లింగమనేని రమేష్ భూములను హెరిటేజ్ కొన్న విధానం, హెరిటేజ్ బోర్డులో చేసిన తీర్మానం, చెల్లించిన డబ్బు, రాజధాని ప్రాంతంలోనే హెరిటేజ్ భూములు కొనుగోలు వెనుక ఉన్న ఉద్దేశ్యంపై ప్రశ్నించినట్లు సమాచారం.
అలాగే మంత్రివర్గ సభ్యుడిగా అలైన్మెంట్ మార్పులపై చర్చ, నిర్ణయం లాంటి అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే చాలావాటికి లోకేష్ సమాధానాలు చెప్పలేదట. నిజానికి తామడిగే ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు చెబుతాడని సీఐడీ అధికారులు కూడా అనుకునుండరు. ఎందుకంటే విచారణ అధికారులతో ఎలా వ్యవహరించాలి ? వాళ్ళడిగే ప్రశ్నలకు చెప్పాల్సిన సమాధానాలు ఏమిటనే విషయాన్ని ములాఖత్ సందర్భంగా చంద్రబాబు, బయట లాయర్లు లోకేష్ కు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చేవుంటారు.
అందుకనే విచారణలో అడ్డదిడ్డమైన సమాధానాలు ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. పైగా తాను చెప్పిన సమాధానాలు విన్నతర్వాత సీఐడీ అధికారులు ధన్యవాదాలు చెప్పినట్లు లోకేష్ చెప్పటమే విచిత్రం. విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే అధికారులు ధన్యవాదాలు చెబుతారా ? పైగా విచారణలో తమకు లోకేష్ సహకరించలేదని సీఐడీ అధికారుల బాగా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు కూడా సీఐడీకి ఎలాంటి సహకారం అందించలేదనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.