లెక్కల్లో 1+1=2 అవుతుంది. అదే రాజకీయాల్లో 1+1= 2 అవ్వచ్చు లేదా 0 కూడా కావచ్చు. రెండుపార్టీలు కలిసినంత మాత్రాన కచ్చితంగా ఏవో అద్భుతాలు జరిగిపోతాయని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం తప్ప మరోటికాదు. ఇపుడిదంతా ఎందుకంటే తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీచేయాలని డిసైడ్ చేయటమే. రెండుపార్టీలు కలిసి పోటీచేయటం వల్ల బీఆర్ఎస్ ను ఈజీగా ఓడించేయచ్చని అనుకుంటున్నాయి. అయితే అదంతా సులభంకాదని చరిత్రను బట్టి అర్ధమవుతోంది.




ఎలాగంటే ఎన్నికలు అనగానే కేసీయార్ తెలంగాణా సెంటిమెంటును ప్రయోగిస్తారనటంలో సందేహంలేదు. పోటీలో ఉన్నవి అన్నీ తెలంగాణా పార్టీలే అయితే ఒకరకంగాను ఆంధ్రా మూలాలున్న పార్టీలు కూడా పోటీలో ఉంటే మరో రకంగాను కేసీయార్ రాజకీయముంటుంది. 2018లో కాంగ్రెస్+టీడీపీ కలిసి పోటీచేసినపుడు కేసీయార్ రాజకీయం ముందు పై రెండుపార్టీలు చావుదెబ్బ తిన్నవిషయం గుర్తుండేవుంటుంది. ఆ విషయాన్ని జనాలు మరచిపోకముందే ఇపుడు బీజేపీ అదే తప్పుచేస్తోంది.




2018 ఎన్నికల్లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నట్లే ఇపుడు జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది పశ్చిమగోదావరి జిల్లా అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి తెలంగాణా జనాల్లో సెటిలర్లు తప్ప మిగిలిన వాళ్ళంతా జనసేనను ఆంధ్రామూలాలున్న పార్టీగానే చూస్తారనటంలో సందేహంలేదు. కాబట్టి జనసేనతో పొత్తు పెట్టుకున్న కారణంగా బీజేపీని కూడా తెలంగాణా వ్యతిరేక పార్టీగానే కేసీయార్  ప్రచారం చేయటం ఖాయం.



నిజంగానే తెలంగాణా సెంటిమెంటు గనుక వర్కవుటైతే పై రెండుపార్టీలు నష్టపోవటం తప్పదనే అనుకోవాలి. అప్పుడు కేసీయార్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. వచ్చేఎన్నికల్లో ఈ రెండుపార్టీలు దెబ్బతింటే దాని ప్రభావం ఏపీ ఎన్నికల్లో కూడా తీవ్రంగానే ఉంటుందనటంలో సందేహంలేదు. మరి ఇవన్నీ ఆలోచించకుండానే బీజేపీ-జనసేనలు పొత్తు పెట్టుకునుంటాయా ? కచ్చితంగా కాదనే సమాధానం చెప్పుకోవాలి. రెండుపార్టీలూ ఇలాంటి పాయింట్లను ఆలోచించే ఉంటాయి. కాకపోతే రెండుపార్టీలకు వేరేదారి లేదు కాబట్టే విధిలేక పొత్తు పెట్టుకున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: