ప్రభుత్వపరంగాకానీ వైసీపీ తరపున కానీ ఏ కార్యక్రమం మొదలవుతున్నా ప్రతిపక్షాలు ఇబ్బందులు పడుతున్నాయంటే అర్ధముంది. కానీ ముందుగా ఎల్లోమీడియానే ఎందుకు ఉలిక్కిపడుతోందో అర్ధంకావటంలేదు. ఈరోజు నుండి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమం పదిరోజులు జరగబోతోంది. ఈ కార్యక్రమం రాష్ట్రమంతా అమలవుతుంది. ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. జనాల మద్దతు కోరే ఈ ప్రోగ్రామ్ లో ఎవరెవరు పాల్గొంటారు, ఎవరు ఆబ్సెంట్ అవుతారనే విషయాన్ని అబ్జర్వర్లు జాగ్రత్తగా గమనిస్తారనటంలో సందేహంలేదు.
సర్పంచ్ స్ధాయి, కౌన్సిలర్ల స్ధాయి నుండి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీ ఇలా పార్టీలో ప్రతి ప్రజాప్రతినిధిని ఇన్వాల్స్ చేస్తున్నారు. మంత్రులు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే ఎలాగూ అధికార యంత్రాంగం కూడా ఉంటుంది. కార్యక్రమంలో గ్రామ, సచివాలయ వాలంటీర్లే ముందుండి గైడ్ చేస్తారు. ఇక్కడే ఎల్లోమీడియాలో భయం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే జగన్ ఒక కార్యక్రమం పెడితే అది అల్లాటప్పాగా ఉండదు. చాలా కచ్చితంగా అమలయ్యేట్లు చూస్తారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమం జరిగిన విధానమే ఇందుకు ఉదాహరణ.
జనాల్లో వ్యతిరేకత ఉన్నా సరే కచ్చితంగా కార్యక్రమం అమల్లవ్వాల్సిందే అన్నది జగన్ ఆదేశం. ఇపుడు తాజా కార్యక్రమంలో కూడా ప్రభుత్వం గడచిన నాలుగున్నర ఏళ్ళుగా అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించబోతున్నారు. ఇక్కడే ఎల్లోమీడియా రూపంలో టీడీపీలోని భయమంతా కనబడుతోంది. కార్యక్రమం మొదలుకాకుండానే ఎల్లోమీడియాలో ప్రత్యేకంగా వ్యతిరేక బ్యానర్ కథనాలు మొదలైపోయాయి. తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెప్పుకుని జనాలను ఓట్లడగటం అధికారపార్టీకి మామూలే కదా. చంద్రబాబు మీద కేసులతో టీడీపీ ఢీలా పడిపోవటమే కాకుండా ఉక్కిరిబిక్కరి అయిపోతోంది.
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు కూడా ఇలాగే చేశారు. జన్మభూమి కమిటీలు, ఆశావర్కర్లు తదితరులతో ప్రచారం చేయించుకున్న విషయం తెలిసిందే. ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసిన చంద్రబాబు దీక్షలు చేసిందంతా ప్రభుత్వ ఖర్చులతోనే. ఖర్చులన్నీ ప్రభుత్వంతో పెట్టించి పార్టీకి ప్రచారం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు. దీన్నే ఎల్లోమీడియా పదేపదే హైలైట్ చేస్తోంది. గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని కూడా మ్యాగ్జిమమ్ వ్యతిరేకంగా ప్రచారంచేసింది. ఎల్లోమీడియా ఇంతగా వ్యతిరేకంగా కథనాలు అచ్చేస్తోందంటేనే ప్రోగ్రామ్ అంటే టీడీపీ ఎంతగా భయపడుతోందో అర్ధమవుతోంది.