చంద్రబాబు ఇక జైలుకు వెళ్లకుండా చూసుకునేందుకు 17 ఏ ద్వారా ఎప్పటికీ అరెస్టు కాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే అది కుదరలేదు. కానీ ఆయనకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాత్రం అనుకూలంగా  తీర్పు వచ్చింది. ఆయనకు బెయిల్ రావడంతో ఇక ఆయన జైలుకు వెళ్లే అవకాశం లేదు. రాబోయే కాలంలో కూడా ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో కూడా వెళ్లకపోవచ్చు.


ఆయనకు హెల్త్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయనే కారణంతోనే బెయిల్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఆయన్ని మళ్లీ విచారణకు పిలిచినా కూడా జస్ట్ హాజరయ్యే వచ్చేయాలి. సాధారణ ఖైదీలా విచారించి వెళ్లిపోమ్మంటారు. అంటే ఇక ముందు ఏ కేసు విషయంలో నైనా చంద్రబాబును విచారించే అవకాశం ఉంటుంది. కానీ ఆయన్ను జైలుకు పంపించే అవకాశం లేదనే చెప్పొచ్చు. అంటే కారణం ఆయన ఆరోగ్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.


ఇలాంటి సందర్భంలో మిగతా కేసుల్లో కూడా ఇలా విచారణ చేయొచ్చు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు. కానీ చివరకు అరెస్టు చేయడం కుదరదు. అలాగే సుప్రీం కోర్టులో 17 ఏ కు సంబంధించిన విచారణ జరగనుంది. అంటే గవర్నర్ అనుమతి లేనిదే మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయరాదని వాదనలు టీడీపీ తరపున న్యాయవాదులు వినిపించనున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి తీర్పు వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


వైసీపీ సర్కారు చంద్రబాబుకు బెయిల్ రావడం పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒక వేళ గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయకూడదని అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం వైసీపీకి భంగపాటే అని చెప్పొచ్చు. మొత్తం మీద చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో ఉంచేలా చేసిన జగన్ ధైర్యానికి చాలా మంది ప్రశంసిస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లను జగన్ ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: