యువగళం మొదలైన దగ్గర నుండి నారా లోకేష్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారు. మామూలుగానే లోకేష్ చెప్పేవన్నీ అబద్ధాలే అని అందరికీ తెలుసు. మీడియా సమావేశాల్లోనో లేకపోతే ట్విట్టర్ ఖాతాల్లోనో అబద్ధాలు చెప్పేవారు. కానీ ఇపుడు పాదయాత్ర పేరుతో జనాల్లోకి వస్తున్నపుడు కూడా తన పద్దతిని మార్చుకోవటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ అధికారంలోకి రాగానే నిత్యవాసరవస్తుల ధరలు వెంటనే తగ్గిస్తారట.





అలాగే గ్యాస్ ధరలు తగ్గిస్తామని, ఇంటిపన్ను, చెత్తపన్ను అని రకరకాల పన్నులను రద్దుచేస్తామని లోకేష్ ప్రకటించారు. వైసీపీ హయాంలో పెరిగిపోతున్న ఖర్చులతో సామాన్య జనాలు బతకటమే కష్టంగా మారిందని మండిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంలో కేంద్రప్రభుత్వం పాత్రే కీలకంగా ఉంటుంది. నిత్యావసరాల వస్తువుల ధరలు ప్రధానంగా  పెట్రోల్, డీజల్ ధరలపైన ఆధారపడుంటుంది. వీటి ధరలు తగ్గితే నిత్యావసరాల ధరలు తగ్గుతాయి. లేకపోతే పెరుగుతునే ఉంటాయి.





అంటే నిత్యావసరాల ధరల పెరుగుదులలో రాష్ట్రాల పాత్ర చాలా తక్కువనే చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా నిత్యావసరాల ధరలు ఎక్కువగానే ఉన్నాయి.  మామూలు స్టోర్లలో దొరికే ధరలకన్నా సొంత సంస్ధ హెరిటేజ్ లో ఇంకా ఎక్కువ ధరలున్నాయన్న విషయం లోకేష్ చెప్పటంలేదు. ఇక ఇంటిపన్నులు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా పెరుగుతునే ఉంటాయి. అలాగే చెత్తపన్నును వేసిందో చంద్రబాబు ప్రభుత్వం. స్వచ్చ భారత్ మిషన్ కు చంద్రబాబు కన్వీనర్ గా ఉన్నపుడు ఇళ్ళపైన చెత్తపన్నువేయాలని సూచించిందే చంద్రబాబు.





చంద్రబాబు సూచన ప్రకారమే 2018 నుండి కేంద్రప్రభుత్వం  ఇళ్ళపైన చెత్తపన్ను వేయటం మొదలుపెట్టింది. గుంటూరులో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి తర్వాత రాష్ట్రమంతా విస్తరించారు. ఆ విషయాన్ని దాచిపెట్టి లోకేష్ చెత్తపన్ను జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొదలైనట్లు ఆరోపించటమే విచిత్రంగా ఉంది. మొత్తానికి తమ హయాంలో మొదలైన దరిద్రమంతా జగన్ ప్రభుత్వానికి అంటగట్టేసి జనాలను మోసం చేయాలని లోకేష్ ప్రయత్నాలే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: