తెలంగాణా ఎన్నికలు ఓవరాల్ గా  బీజేపీని నిరాసపరిచినా ఇందులో కూడా ఒక సంతోషకరమైన విషయం ఉంది. అదేమిటంటే తన పట్టును పెంచుకోవటం. మొన్నటి ఎన్నికలకు ముందు బీజేపీకి మొత్తం మీద ఉన్నది కేవలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే. అలాంటిది తాజా ఎన్నికల్లో ఎనిమిది మంది కమలనాదులు గెలిచారు. పార్టీబలం మూడు సీట్ల నుండి ఎనిమిది సీట్లకు పెరిగిందంటే దాదాపు 170 శాతం పెరుగుదల నమోదైనట్లే.





ఆమధ్య గెలిచిన రెండు సీట్లు కూడా రెండు ఉపఎన్నికల్లో గెలిచినవే. కానీ ఇపుడు గెలిచిన ఎనిమిది సీట్లు సాధారణ ఎన్నికల్లో గెలిచినవి. కాకపోతే అప్పుడు గెలిచిన మూడులో రెండు సీట్లను కోల్పోయింది. గోషామహల్ కు అదనంగా ఏడుసీట్లను గెలిచింది. పార్టీ తరపున పోటీచేసిన ప్రముఖ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందనరావు, ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్ళు చాలామంది ఓడిపోయారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే  బీజేపీ తరపున గెలిచిన ఎనిమిది మంది ఎంఎల్ఏల్లో ఏడుగురు బీఆర్ఎస్ అభ్యర్ధులపైనే గెలిచారు.





ఆదిలాబాద్ నియోజకవర్గంలో పాయల్ శంకర్ బీఆర్ఎస్ అభ్యర్ధి జోగు రామన్నపై 6,692 ఓట్లతో గెలిచారు. గోషామహల్  నియోజకవర్గంలో రాజాసింగ్ కారు గుర్తు అభ్యర్ధి నందకిషోర్ వ్యాస్ పై 21,457 ఓట్లతో గెలిచారు. నిజామాబాద్ అర్బన్  నియోజకవర్గంలో పోటీచేసిన ధన్ పాల్ సూర్యయనారాయణ సమీప కాంగ్రెస్ అభ్యర్ధి షబ్బీర్ ఆలీపై 15,387 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరంరెడ్డి అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఏకంగా 50,703 ఓట్ల మెజారిటితో చిత్తుగా ఓడించారు.





ఆర్మూర్ నియోజకవర్గంలో పైడి రాకేష్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి వినయ్ కుమార్ రెడ్డి పైన 29,669 ఓట్ల మెజారిటితో గెలిచారు. కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ పైన 5,156 ఓట్లతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక్కడ రమణారెడ్డి కేసీయార్ ను మాత్రమే కాదు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రొజెక్టవుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా ఓడించారు. ఫైనల్ గా సిర్పూర్ నియోజకవర్గంలో పాల్వాయి హరీష్ బాబు బీఆర్ఎస్ అభ్యర్ధి కోనేరు కోనప్పపై 3,088 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: