దొంగఓట్ల విషయంలో రెండు ప్రధాన పార్టీలు ఒకదానిపై మరొకటి చేసుకుంటున్న ఫిర్యాదులను చూస్తుంటే రెండుపార్టీలూ దొంగఓట్లలో ఇన్వాల్వ్ అయినట్లు అర్ధమవుతోంది. కాకపోతే ఒక పార్టీ ఎక్కువ మరో పార్టీ తక్కువంతే. దొంగఓట్లు చేర్పించటం, నిజమైన ఓటర్లను ఓటర్ల జాబితానుండి తొలగిస్తున్నట్లు రెండు పార్టీలు పరస్పరం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమీషనర్ ను కలిసి ఫిర్యాదులు చేసుకున్నాయి. కేంద్ర ఎన్నికల కమీషన్, కేంద్రప్రభుత్వం చేతకానితనం వల్ల దొంగఓట్ల సమస్య ఎన్నిక ఎన్నికకు పెరిగిపోతోంది. ప్రతి ఓటరు కార్డును ఆధార్ కార్డుతో లింకు చేయాలని కమీషన్ చేసిన ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం తిరస్కరించింది.





దొంగఓట్లను చేర్పించటం, ప్రత్యర్ధులకు పడతాయని అనుమానాలున్న ఓట్లను తొలగించటం రాజకీయపార్టీలకు మామూలైపోయింది.  ఈ విషయంలో ఈ పార్టీపార్టీ అని విడదీసేందుకు లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఎక్కువ అవకాశముంటుందని అందరికీ తెలిసిందే. ఇపుడు వైసీపీ పైన టీడీపీ, టీడీపీ పైన వైసీపీ ఎంపీలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమీషనర్ను కలిసి ఫిర్యాదులు చేసుకున్నారు. టీడీపీ 40 లక్షల దొంగఓట్లను చేర్పించినట్లు వైసీపీ ఎంపీలు ఫిర్యాదుచేశారు. సేవామిత్ర, మై టీడీపీ అనే ప్రత్యేక యాప్ ల ద్వారా టీడీపీ దొంగఓట్లను చేర్చినట్లు ఫిర్యాదు చేశారు. పనిలోపనిగా దొంగఓట్లపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా వైసీపీపై ఫిర్యాదు చేశారు.





టీడీపీ ఎంపీలు కేంద్ర కమీషనర్ ను కలిసి వైసీపీ 14 లక్షల దొంగఓట్లను చేర్పించినట్లు పిర్యాదుచేశారు. దొంగఓట్ల ఏరివేతలో అధికారులను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నట్లు కూడా టీడీపీ ఎంపీలు ఫిర్యాదుచేశారు. ఓటర్ల నమోదులో అవకతవకలపై చీఫ్ ఎన్నికల కమీషనర్ కు 119 ఫిర్యాదులు చేసినట్లు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు. రెండు పార్టీల ఫిర్యాదులను గమనిస్తే రెండుపార్టీలూ దొంగఓట్లను చేర్పించినట్లు అర్ధమవుతోంది.





అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఒకపార్టీ చేర్పించిన దొంగఓట్లను మరోపార్టీ పట్టుకుని రద్దుచేయించేందుకు ప్రయత్నిస్తుండటమే. రాబోయే ఎన్నికలు ఇటు వైసీపీతో పాటు అటు టీడీపీకి చాలా కీలకం కాబట్టే దొంగఓట్ల విషయంలో రెండుపార్టీలు ఇంత గోలచేస్తున్నాయి. కాకపోతే మెజారిటి మీడియా మద్దతు టీడీపీకి ఉందికాబట్టే టీడీపీ నేతల ఆరోపణలకు మద్దతుగా వార్తలు, కథనాలు వస్తున్నాయంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: