తాను ఎంత అజ్ఞానో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనంతట తానే బయటపెట్టుకున్నారు. తాను ఏమి మాట్లాడుతారో కూడా తెలీకుండానే మాట్లాడేస్తుంటారు. లక్షలాది పుస్తాకాలు చదివానని, తాను చాలా జ్ఞానసంపున్నుడనని చెప్పుకుంటుంటారు. అయితే సినిమాల్లో ఉన్నంతవరకు బయట ప్రపంచానికి పవన్ కు గురించి పెద్దగా తెలీలేదు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పుడే తెలిసిపోయింది పవన్ ఎంతటి జ్ఞానో. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పోలిపల్లిలో బహిరంగసభ జరిగింది.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ పరిస్ధితులు మారాలనే తాను టీడీపీతో కలిసి వెళుతున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు చెప్పారట. బీజేపీతో పొత్తులో ఉండికూడా టీడీపీతో చేతులు కలిపినట్లు అమిత్ కు చెప్పారట. టీడీపీ, జనసేన పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కావాలని అమిత్ షా ను అడిగినట్లు పవన్ చెప్పారు. ఇక్కడే పవన్ అజ్ఞానమంతా బయటపడింది. ఎన్డీయేలో జనసేన పార్టనర్. ఎన్డీయేకి టీడీపీకి సంబంధంలేదు. పైగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ-టీడీపీ ప్రత్యర్ధిపార్టీలని అందరికీ తెలిసిందే.
బీజేపీ పొత్తులో ఉంటు తాను టీడీపీతో చేతులు కలుపుతున్నట్లు చెబితే అమిత్ షా ఎలా అంగీకరిస్తారని పవన్ అనుకున్నారో అర్ధంకావటంలేదు. పైగా టీడీపీ+జనసేన పొత్తుకు అమిత్ షా ఆశీస్సులు కావాలని అడగటం, ఇస్తారని అనుకోవటం పెద్ద జోక్. పవన్ తో సమస్య ఏమిటంటే తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటమే. ఎదుటివాళ్ళని తక్కువగా అంచనా వేయటంతో పాటు తనగురించి తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటంతోనే సమస్యలు వస్తున్నాయి.
అయితే తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్న విషయం కూడా పవన్ కు తెలుస్తున్నట్లు లేదు. ఎందుకంటే పవన్లోని అజ్ఞానాన్ని చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా కప్పిపెడుతోంది. 2019 ఎన్నికల్లో తాను పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయిన తర్వాతయినా నిజాయితీగా విశ్లేషించుకునుంటే పవన్లో ఇపుడీ సమస్య ఉండేది కాదు. పవన్ ఎంతటి అజ్ఞానంలో ఉన్నారంటే తన ఓటమికి జగన్మోహన్ రెడ్డే కారణమని మండిపోయేంతగా. ప్రత్యర్ధి అన్నాక ఓడించటానికే ఎవరైనా చూస్తారన్న కనీస జ్ఞానం కూడా పవన్లో లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.