కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలించాయి. తదనంతర కాలంలో యూపీఏలో ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. దీని వల్ల 2019 లో కూడా యూపీఏ కేంద్రంలో అధికారానికి దూరమైంది. ఇదే సందర్భంలో బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకుపోవడంతో విజయం సాధించింది.


నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ 2019 ఎన్నికల్లో సొంతంగానే 303 సీట్లు సాధించి కేంద్రంలో అధికారం సొంతం చేసుకుంది. అయినా మిత్ర పక్షాలను కాదనకుండా వారితోనే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది. అయితే దీన్ని ఎదుర్కొవడానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడానికి కాంగ్రెస్ మిత్ర పక్షాలు కొత్త కూటమిని కట్టాయి. దానికి ఇండియా అని పేరు పెట్టుకుని ముందుకు నడిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, డీఎంకె, కమ్యూనిస్టు పార్టీలు, శివసేన, తదితర పార్టీలు ఉన్నాయి.


అయితే కాంగ్రెస్ ప్రధాన పార్టీగా కొనసాగుతున్న ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో గెలవాలని దృడ నిశ్చయంతో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రాంతీయ పార్టీల హవా నడిచే రాష్ట్రాల్లో ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు పొందాలి. వాటిలో ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలి. ఇలా అనేక సమీకరణాలను అధిగమించి పోటీ చేసి బీజేపీని ఓడించాలి.


కానీ ఈ మధ్య ఓ టీవీ చానల్ నిర్వహించిన ఓటర్ సర్వేలో మళ్లీ బీజేపీకి 290 నుంచి 300 పైనే సీట్లు వస్తాయని, కాంగ్రెస్ దాని అనుబంధ కూటమి అయినా ఇండియాకు కేవలం 16 నుంచి 200 స్థానాల్లో  మాత్రమే గెలుస్తారని తెలిపింది. దీంతో ఇండియా కూటమి సభ్యుల్లో ఒక్క సారిగా భయం పట్టుకుంది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న వారికి ఈ సర్వే నిజంగా షాక్ ఇచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: