తాజా రాజకీయ పరిణామాలను అడ్డంపెట్టుకుని ఎల్లోమీడియా జగన్మోహన్ రెడ్డిపైకి మంత్రులు, ఎంఎల్ఏలను రెచ్చగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో కొందరు ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వకూడదని జగన్ అనుకున్నారు. మరికొందరు మంత్రులు, ఎంఎల్ఏలను నియోజకవర్గాలను మార్చుతున్నారు. కొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా, ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీచేయిస్తున్నారు. నేతలకు నియోజకవర్గాలను మార్చటం అన్నీ పార్టీల్లోను జరిగే సహజమైన తంతే. కాని వైసీపీలో ఇపుడు జరుగుతున్నదాన్ని మాత్రం చంద్రబాబునాయుడు అండ్ కో, ఎల్లోమీడియా బూతద్దంలో చూపిస్తోంది.





పదేపదే ప్రతిరోజు నెగిటివ్ వార్తలను రాసి అధికారపార్టీ నేతలను రెచ్చగొడుతోంది. ఎందుకంటే వాళ్ళంతా రెచ్చిపోయి  జగన్ పై తిరుగుబాటు చేయాలని, పార్టీలో నుండి బయటకొచ్చేసి టీడీపీకి మేలుచేయాలని కలలుకంటోంది. ఒకవేళ పార్టీలో నుండి బయటకు రాకపోతే వైసీపీలోనే ఉండి దెబ్బకొట్టాలని కూడా కోరుకుంటోంది. అంతిమంగా జగన్ చేస్తున్న మార్పులతో వైసీపీ ఓడిపోయి చంద్రబాబు లాభపడాలన్నది ఎల్లోమీడియా తాపత్రయం.





జగన్ వ్యతిరేకులు అనుకుంటేనో ఎల్లోమీడియా కోరుకుంటేనో లేకపోతే చంద్రబాబు శపథం చేశారనో జనాలు వైసీపీని ఓడించరు. పరిపాలన తాము ఆశించినట్లు లేదని అనుకున్నపుడు మాత్రమే జనాలు జగన్ను ఓడగొడతారు. ఈ లాజిక్ మరచిపోయిన ఎల్లోమీడియా తమకు పడదుకాబట్టి జనాలందరు జగన్ కు వ్యతిరేకమైపోయారనే భ్రమల్లో బతుకుతోంది. అందుకనే ప్రతిరోజు జగన్ పై బురదచల్లేట్లుగా రాతలు రాస్తు, పార్టీలో వ్యతిరేకతను రెచ్చగొట్టేట్లుగా వార్తలు, కథనాలను అచ్చేస్తోంది.





ఎల్లోమీడియాలో వచ్చే కథనాలను అంతే భ్రమల్లో బతుకుతున్న చంద్రబాబు అండ్ కో కూడా గుడ్డిగా నమ్ముతోంద. ఈ నమ్మకంతోనే రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీచేసినా 160 సీట్లు ఖాయమని పదేపదే ప్రకటనలు ఇస్తున్నారు తమ్ముళ్ళు. ఇపుడు జగన్ కు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు ఇస్తు సంబరపడిపోవటం కాదు. రేపు టీడీపీ, జనసేన పొత్తులో పోటీచేయబోయే  సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ప్రకటించేటపుడు ఉంటుంది అసలు సినిమా. ఇపుడు రోడ్డుమీద పడిన విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం కేవలం ఒక శాంపుల్ మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: