ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు మరో మూడు నెలలలో రాబోతున్నాయి.. గత ఎన్నికలలో చాలా ఘోరమైన పరాజయాన్ని చూసిన టిడిపి ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో అన్ని పార్టీలతో కలిసి పొత్తుల పెట్టుకుని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని సైతం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న హడావిడి చంద్రబాబుకు చాలా ఇబ్బందికరంగా మారుతున్నట్లు పలువురు రాజకీయ నాయకులు తెలియజేస్తున్నారు..


ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఒక గొడవ జరిగింది. ముఖ్యంగా కర్రలతో దాడి చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా రాబోయే ఎన్నికల పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా సమాచారం.. గత కొన్ని రోజులుగా టిడిపిలో చంద్రబాబు బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలం సినిమాల పైన మాత్రమే ఎన్టీఆర్ ఫోకస్ పెడుతున్నారు తప్ప రాజకీయాల పరంగా చూడడం లేదు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కూడా టిడిపి కార్యకర్తలు పలు రకాల నిరసనలు ఆందోళనలను చేపట్టారు.


కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం ఈ విషయంలో ఏ విధంగా స్పందించలేదు.. అప్పుడు చాలామంది టిడిపి రాజకీయ నాయకులు, శ్రేణులు సైతం ఎన్టీఆర్ పైన చాలా ఆగ్రహాన్ని పెంచుకున్నారు.. అప్పటినుంచి ఎన్టీఆర్ పైన కావాలని టిడిపి నాయకులు ట్రోల్ చేసే విధంగా పోస్ట్లు పెడుతున్నారు.. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం టిడిపికి వ్యతిరేకంగా ఉంటూ ఎన్టీఆర్ కు సపోర్ట్ చేస్తున్నట్లుగా పలు రకాల పోస్టులు షేర్ చేయడం జరుగుతోంది.. ఇలా అప్పటినుంచి ఇద్దరి అభిమానుల మధ్య ఒక వార్ మొదలవుతూనే ఉంది.. నారా లోకేష్ పాదయాత్రలో కూడా ఎన్టీఆర్ భవిష్యత్తు సీఎం అంటూ కూడా పోస్టర్లు పెట్టి నారా లోకేష్ కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేయడం జరిగింది ఎన్టీఆర్ అభిమానులు. ఇటీవల కళ్యాణ్ రామ్ కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారని విషయంపై ఎన్టీఆర్ తో పాటు తమ కుటుంబంతో కలిసి నిర్ణయం తీసుకుంటామంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: