ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సమీపిస్తున్నాయి.ఈ రోజు తెలుగు దేశం పార్టీ అధినేత సీనియర్ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ప్రధానంగా నిమ్మకూరు ఉన్న నియోజకవర్గం గుడివాడ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన వర్ధంతి సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా గుడివాడలో పోటాపోటీ కార్యక్రమాలు అనేవి రసవత్తరంగా మారనున్నాయి. ఇందులో భాగంగా.. గురువారం నాడు టీడీపీ నిర్వహించే "రా.. కదలి రా.." బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అలాగే మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని.. ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.ఇలా ఒకే దగ్గర ఇరు వర్గాల వారు సభలు, కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకుంటుండంతో... ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో అప్పుడే వివాదం కూడా చెలరేగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఈ రోజు గుడివాడ అంతా కూడా గరం గరంగా ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహం తాను ఏర్పాటు చేసిందని, జూనియర్ ఎన్టీఆర్ అందుకు సహకరించారని కొడాలి నాని చెబుతున్నారు. అదే విగ్రహానికి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించే అవకాశం ఉందని అంటున్నారు.ఎన్టీఆర్‌ గారి వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడకు వెళ్లనున్నారు.


ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఆయన నివాళి అర్పించనున్నారు. అది పూర్తికాగానే గుడివాడలో "రా.. కదలి రా.." కార్యక్రమం నిర్వహించేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ స్థానిక ముఖ్యనాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు.ఇక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ ఇంకా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ తోపాటు వెనిగండ్ల రాము అలాగే రావి వెంకటేశ్వరరావు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇక అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ఎన్నికల వేళ ఈ బలనిరూపణ అనేది చాలా ముఖ్యమని భావిస్తున్నారు.ఇక ఎన్టీఆర్‌ కు వీరాభిమాని అయిన కొడాలి నాని.. ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ కు ఘనమైన నివాళి అర్పించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు కూడా సిద్ధం చేశారు. ఇక ఇప్పటికే అటు టీడీపీ - ఇటు నాని వర్గీయులు మధ్య ఫ్లెక్సీల విషయంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: