జగన్మోహన్ రెడ్డి అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఒళ్ళంతా కారం రాసుకున్నట్లు మండిపోతుందని అందరికీ తెలిసిందే. జాతరలో పోతురాజు శివాలెత్తినట్లు ఊగిపోతారు. పవన్ అలా ఎందుకు చేస్తారంటే అహంకారం+ఈర్ష్యతోనే. తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోతే జగన్ 151 సీట్ల అఖండ విజయంతో  అధికారంలోకి వచ్చేరానే ఆక్రోశమే ప్రధాన కారణం. ఇపుడిదంతా ఎందుకంటే పవన్ మాటల్లో అదే అహంకారం కనబడుతోంది, అదే ఏడుపు రాగం వినిపించారు.





జనసేన ఆఫీసులో నేతల సమావేశంలో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలవనిచ్చేది లేదన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని కానివ్వనని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా చూడటం వల్ల వైసీపీని ఓడించాలన్నారు. ఇంకా చాలా మాటలే చెప్పారు కాని తన మాటలు విన్నతర్వాత ఆయన వైఖరిపైనే అనుమానాలు పెరిగిపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ను ఓడించటం, అధికారంలోకి రాకుండా చూడటం అన్నది తన చేతిలో లేదన్న విషయాన్ని పవన్ మరచిపోయారు.





జగన్ ఓటమి, గెలుపన్నది జనాల చేతిలో ఉంది. జనాలు అనుకుంటేనే ఎవరైనా గెలుస్తారు లేదా ఓడుతారు. పవన్ ఇపుడు చేయాల్సింది ఏమిటంటే జగన్ ఎలా గెలుస్తారో చూస్తామని చాలెంజ్ చేయటంకాదు. తాను ఎలా గెలవాలో వ్యూహాలు రచించటం. పార్టీ గెలుపుకు, తన విజయానికి ఏది అవసరమో ఆ పనులు చేయాలి కాని 24 గంటలూ జగన్నే టార్గెట్ చేయటం వల్ల ఎలాంటి ఉపయోగముండదు. పైగా పోయిన ఎన్నికల్లో జనసేనను ఓ 40 సీట్లలో గెలిపించుండాల్సింది, తనను అయినా గెలిపించుడాల్సిందని అదే ఏడుపురాగం వినిపించారు.





ఇదేమాటను కొన్ని వందలసార్లు వినిపించుంటారు ఇప్పటికి. 2019లో ఓటమి గురించి ఇంకా మాట్లాడుతున్నారంటే అప్పటి దెబ్బ ఎంతబలంగా తగిలిందో అర్ధమైపోతోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం మాట్లాడకుండా పోయిన ఎన్నికల్లో ఓటమిగురించే మాట్లాడితే ఏమిటి ఉపయోగమో పవన్ కే తెలియాలి. మొత్తానికి తనకు జగన్ అంటే ఎంతమంటుందో మరోసారి తన మాటల్లో బయటపెట్టుకున్నారు. తనకు జగన్ అంటే వ్యక్తిగతంగా ధ్వేషం ఏమీలేదని చెప్పుకోవటమంతా అబద్ధమే అని తేలిపోయింది.





మరింత సమాచారం తెలుసుకోండి: