తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ గత కొంతకాలంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ విషయం చాలా వైరల్ గా మారింది.. నిజామాబాద్ లో ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని అందరూ అనుకున్నారు.. అటు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీకి దిగబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ దిల్ రాజు గారు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


తాను పొలిటికల్పరంగా ఎక్కడ పాల్గొనేది లేదంటూ గతంలో క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలవేళ మరొకసారి దిల్ రాజు పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపించాయి. వీటికి తోడుగా దిల్ రాజు కూడా కాంగ్రెస్ నేతలతో బాగా దగ్గరగా మమేకమవడంతో మరింత ఈ వార్తలకు బలం చేకూరింది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లను దిల్ రాజ్ కలిశారు.


అయితే ఇలాంటి సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.. నిన్నటి రోజున దిల్ రాజ్ కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన కలిశారు సడన్గా దిల్ రాజు ఇలా కలవడంతో దిల్ రాజు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే విషయంపై జోరుగా ప్రచారాలు వినిపించాయి.. కానీ అసలు విషయం మాత్రం ఏమిటంటే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశీష్ రెడ్డి వివాహం  ఫిక్సయినందువలన వివాహానికి రావాల్సిందిగా సినీ ప్రముఖు,రాజకీయ నాయకులను దిల్ రాజు ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ను కలిసి తన సోదరుడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అలాగే కెసిఆర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకున్నట్లు సమాచారం..కేవలం మర్యాదపూర్వకంగానే కలిసి ఆహ్వానించినట్లు దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: