2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ఏకంగా 151 నియోజకవర్గాల్లో విజయ కేతనం ఎగురవేసిన వైసీపీ.. ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో వై నాట్ 175 నినాదాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లబోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నమోదు చేసిన విజయాన్ని మరోసారి రిపీట్ చేయాలని అనుకుంటుంది. అందులో భాగంగానే  రోడ్ షోలు, సభలతో విస్తృతంగా ప్రజలకు దగ్గర అయ్యేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ఎన్నికల కోసం రోజుకు రెండు లేదా మూడు సభలు సమావేశాలతో పాటు రోడ్ షోలో పాల్గొనడంతో పాటు తాము గతంలో కైవసం చేసుకోలేకపోయిన నియోవర్గాలలో కూడా ఈసారి జెండా పాతాలని చూస్తుంది. ఈ ఎన్నికల వేదికగా వై నాట్ 175 నినాదాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని వెళ్లడంతో పాటు.. ఈ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇంకా పొత్తులతో వస్తున్న విపక్షాల విధానాన్ని తూర్పారాపట్టబోతున్నారు సీఎం జగన్.నాడు-నేడు పేరుతో సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఇటీవల ప్రజల్లోకి తీసుకెళుతున్న జగన్ అదే ఫార్ములాను మరోసారి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేలా స్పీచ్‎ను తయారు చేసుకుంటున్నారు.


గత ప్రభుత్వ వైఫల్యాలను తెలిపి 2019 ఎన్నికల్లో తన స్పీచ్‎లతో ప్రజలకు చేరువైన జగన్.. ఈ ఎన్నికల ప్రచారంలో కూడా అంతే దూకుడుతో తన ప్రసంగాన్ని ఉండేలా చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో సమస్యలను ఎలివేట్ చేస్తూ అధికారంలోకి వచ్చి.. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేశారో జగన్ వివరించనున్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం ఏ రకంగా చుపారో అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్లబోతున్నారు సీఎం జగన్. ఇక ప్రాంతాలవారీగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వెనుక బాటుతనం, ఉత్తరాంధ్రలో వలసలు, ఉద్దానం తాగునీటి సమస్యలు, మేనిఫెస్టో హామీల అమలు, సంక్షేమ పథకాలు, రైతాంగం ఇంకా యువత మహిళల కోసం అమలు చేసిన సంస్కరణలను కూడా ప్రజలకు వివరించబోతున్నారు. అందుకే సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలతో ఎన్నికల ప్రచారం ఉధృతం చేయబోతోన్నటు సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: