సీఎం జగనన్న తనకు ఇల్లు ఇచ్చారని సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో అధికారులు ఆమెకు ఇంటి స్థలం పట్టా అందజేశారు. ఈ సందర్భంగా మీడియా తో  మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు ఇల్లు వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ తెగ సంబరపడిపోయింది.


ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు అభిమానులు ఆమెపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు పాల్పడ్డారు. దీనిని భరించలేక ఆమె ఆత్మహ్యతకు పాల్పడింది అని కొన్ని మీడియా ఛానళ్లు, వైసీపీ అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. మరోవైపు కొందరు మాత్రం ఆమె వ్యక్తిగత కారణాలతోనే చనిపోయిందని చెబుతున్నారు.   ఈ క్రమంలో ఎల్లో మీడియాలో ఓ వార్త  రాసుకొచ్చింది. రైలు ఢీకొని ఆమె గాయపడినట్లు వార్త రాసుకొచ్చారు.


రైలు ఢీకొని మహిళ గాయపడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. జన్మ భూమి ఎక్స్ ప్రెస్ అప్పుడే వేగం పుంజుకుంటున్న క్రమంలో పట్టాలపై శివారులో ఓ ముప్పై ఏళ్ల మహిళ కనిపించడంతో చోదకుడు ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఈ క్రమంలో రైలు ఆమెను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను జిల్లా ప్రధాన ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరుకి తరలించారు.


పట్టాలపై నిల్చొంది అంటే ఆత్మహత్యాయత్నం అనేగా అర్థం. ఏది ఏమైనా చివరకు ఆమె సంతోషం.. అంతలోనే విషాధంగా మారడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు పోలీసుల ఫిర్యాదు చేయడానికి ఇష్టపడటం లేదు. ఈ రాజకీయాల్లోకి తమను లాగొద్దని వారు వేడుకుంటున్నారు. కాబట్టి ఇదంతా ఫేక్ న్యూస్ అని వైసీపీ కావాలనే రాద్ధాంతం చేస్తోందని ఎల్లో మీడియా చెబుతోంది. రైలు పొరపాటున ఢీకొట్టింది అని వార్తలు ప్రచారం చేస్తోంది. ఏది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: