రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం నానా అవస్తలుపడి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తమతో  బీజేపీని కూడా పొత్తులో కలుపుకున్నారు. ఇప్పటికైతే ఈ కూటమి అతుకుల బొంతలాగే కనబడుతోంది. ఎందుకంటే పొత్తులు పెట్టుకోవాలన్న నిర్ణయానికి రావటానికి నెలలు పట్టింది. అలాంటిది సీట్ల సర్దుబాటు దగ్గరకు వచ్చేసరికి నానా అవస్తలు పడుతున్నాయి. ఈ సమస్యలు ఎప్పుడు సర్దుబాటు అవుతాయో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ విషయాలను పక్కనపెట్టేస్తే అన్నింటికీ కీలకమైన సమస్య ముందుంది.




అదేమిటంటే కూటమి నేతలు జనాలకు ఏమని సమాధానం చెబుతారనే విషయంపై చర్చలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ సమస్య ఏమిటంటే 2014 ఎన్నికల్లో కూడా ఇవే పార్టీలు కూటమిగా ఏర్పడి జనాలకు నోటికొచ్చిన హామీలిచ్చేశాయి. అలాంటి హామీల్లో ముఖ్యమైనది ప్రత్యేకహోదా. తిరుపతిలో జరిగిన బహిరంగసభలో వెంకయ్యానాయుడు మాట్లాడుతు ఎన్డీయే అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్ళ ప్రత్యేకహామీని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.





ఆ హామీకి ఎన్డీయే కట్టుబడుంటుందని మోడి పదేపదే చెప్పారు. తర్వాత వెంకయ్యనాయుడు మాట్లాడుతు ఏపీకి ప్రత్యేకహోదా ఐదేళ్ళు చాలదని కనీసం పదేళ్ళు కావాలని వేదికమీదనే మోడీకి సూచించారు. దానికి మోడి కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు మాట్లాడుతు ఏపీకి ప్రత్యేకహోదా పదేళ్ళు కూడా చాలదని తక్కువలో తక్కువ 15 సంవత్సరాలు కావాలన్నారు. దీనికి కూడా మోడీ సానుకూలంగానే స్పందించారు. చివరగా పవన్ కల్యాణ్ మాట్లాడుతు ప్రత్యేకహోదా తో పాటు ఇతర హామీలను అమలుచేయించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు.





సీన్ కట్ చేస్తే అందరు తమ ప్రకటనలను, హామీలను తుంగలోతొక్కేశారు. అందరు కలిసి జనాలను మోసంచేశారు. పదేళ్ళు తిరిగేటప్పటికి మళ్ళీ మూడుపార్టీలు కలిసి పొత్తుపెట్టుకున్నాయి. అంటే మళ్ళీ జనాలను మోసంచేయటానికి రెడీ అయాపోయాయని అర్ధమవుతోంది. అప్పటి హామీలను జనాలు గుర్తుచేస్తే ఏమి సమాధానం చెబుతారో చూడాలి. అలాగే కొత్త హామీలతో మోసంచేయటానికి కూడా రెడీ అయిపోయినట్లున్నారు. మరీసారి ఇకేమి హామీలిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: