పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీత హిందూపురంలో బాలకృష్ణకు పోటీగా టీన్ దీపిక.. మంగళగిరిలో లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్యను నిలబెట్టబోతున్నారు. ఇలా కీలకమైన నేతలపై కూడా మహిళలను నిలబెట్టడం వల్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ ను ఓడించడమే లక్ష్యంగ వైసిపి ప్రభుత్వం భావించి ఆయా నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా జగన్ వ్యూహంలోని భాగంగానే మహిళ అభ్యర్థులను సైతం బరిలోకి దింపినట్లుగా కనిపిస్తోంది. మరి జగన్ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయం మాత్రం తెలియాలి అంటే మరొక కొన్ని నెలలు ఆగాల్సిందే.
బిజెపి టిడిపి జనసేన పొత్తులో భాగంగా సీట్లను కేటాయిస్తూ తమ అభ్యర్థులను కూడా చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రకటించారు.. ముఖ్యంగా టిడిపి జనసేన మధ్య అటు నాయకులు కార్యకర్తలు మధ్య రోజుకు ఒక వ్యవహారం బయటికి వస్తూనే ఉంది. ముఖ్యంగా సఖ్యత కుదరలేదు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. నిన్నటి రోజున అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు తన అవసరాలకు అనుగుణంగానే మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి చేరారని కూడా వెల్లడించారు.. ప్రస్తుతం అటు టిడిపి, వైసీపీ మేనిఫెస్టో కోసం ప్రజలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.