టాలీవుడ్ లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటూ ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుతం ఎక్కువగా ఎన్నికల వైపు ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే బీజేపీ టిడిపి పార్టీతో పొత్తు కలుపుకొని ఈసారి ఎలక్షన్స్ లో నిలబడే విధంగా ప్లాన్ చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల సైతం తమ అభ్యర్థులు పోటీ చేసే జాబితాలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే మవోయిస్టు కీలక నేత గణేష్ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలపైన స్పందిస్తూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది..



ముఖ్యంగా సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ పైన తీవ్రమైన విమర్శలను సైతం చేశారు... ఆయన పార్టీని స్థాపించేటప్పుడు తమ పార్టీ కూడా కమ్యూనిటీ భావాజలం కలిగి ఉంటుందంటూ వెల్లడించారు. కానీ అతడు ప్రస్తుతం బిజెపితో పొత్తు పెట్టుకుని మరి రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించడం జరిగింది.. పవన్ కళ్యాణ్ కు స్థిరమైన రాజకీయ విధానం అనేది లేదని అతనికి విశ్వాసనీయత చాలా తక్కువ అని.. సినీ గ్లామర్ కాపు కులస్తుల గుర్తింపుతోనే రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిపోయింది అంటూ మావోయిస్టు గణేష్ సైతం ఒక లేఖ ద్వారా వెల్లడించారు.



దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇప్పటివరకు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ను ఇదే విధంగానే విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు మావోయిస్టు కూడా విమర్శిస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇటివలె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి డైలాగులను కూడా విడుదల చేయగా అందులో కూడా పొలిటికల్ పరంగా ఉండడంతో  అసలు ఈ సినిమాకు పొలిటికల్ కలుపు తగిలిస్తే ఎవరు చూస్తారు అంటూ కూడా పలువురు అభిమానులు వాపోతున్నారు. మరి ఆ మావోయిస్టు రాసినటువంటి లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: