ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలలో వేడి రోజుకి పెరిగిపోతుందనే చెప్పాలి.. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ పార్టీని అధికారంలోకి తీసుకెళ్లాలని ఎవరికీ వారు సన్నహాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా జగన్ ను గద్దెదించాలని అటు టీడీపీ ఇటు జనసేన బలంగా భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ దెబ్బతో ఏపీలో ప్రతిపక్షాలు అనే టాపిక్ లేకుండా చూసుకోవాలని భావిస్తోంది వైసీపీ.. ఇలాంటి సమయంలో ఇప్పటికే పలు జాతీయ సంస్థలు కూడా ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడించగా తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కూడా తన అంచనాలను వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఏపీలో రసవత్తర రాజకీయానికి తెరలేపిన సంగతి తెలిసిందే .. అందుకే ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లా అన్నట్లుగా ప్రతిరోజు ఏదో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం అవుతూనే ఉంది ..ఈ సమయంలోనే తాజాగా మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జిపిటి కో పైలట్ రానున్న ఏపీ ఎన్నికల ఫలితాల పైన అంచనాలను వెల్లడించింది..


ఇందులో భాగంగానే వైసీపీకి గుడ్ న్యూస్ చెప్పింది.. మైక్రోసాఫ్ట్ కో పైలట్ రానున్న ఏపీ ఎన్నికలకు సంబంధించి తాజా అంచనాలను వెలువరిస్తూ ఈసారి కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరొకసారి విజయం సాధించి గద్దెను ఎక్కుతారని వెల్లడించింది. అంతేకాదు కో పైలట్ ఆల్గారిథం, ప్రజల సెంటిమెంటు, గ్రౌండ్ లెవెల్ వ్యూహాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఖచ్చితమైన ఫలితాలను ప్రదర్శిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి కి రానున్న ఎన్నికల్లో 49.14% వరకు ఓట్లు సాధించి మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంటుందని మోడల్ ప్రీ పోల్ సర్వే చెబుతున్న నేపథ్యంలో వీటితోపాటు అటు రాజకీయ విశ్లేషణలు అలాగే ఇతర ఎన్నికలలో వాటి ట్రాక్ రికార్డును కూడా పరిగణలోకి తీసుకొని కో పైలట్   పరిశీలిస్తోందని నిపుణులు చెబుతున్నారు..

ఈ క్రమంలోనే కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రూపొందించిన అంచనాలపై సందేహాలను వ్యక్తపరుస్తూ దాని విశ్వసనీయతను ప్రశ్నిస్తుంటే..  మరికొంతమంది మాత్రం కో పైలట్ డేటా ఆధారిత విధానం పై నమ్మకం కనబరుస్తున్నారు. ఏది ఏమైనా పూర్తి వివరాలు తెలియాలంటే ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: