ఆంధ్రాలో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు అధికార ప్రతిపక్షాలు చాలా హోరాహోరీగా తలబడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీని ఢీ కొట్టేందుకు సైతం విపక్షాలు సైతం పొత్తు పెట్టుకుని ఈసారి బరిలోకి దిగబోతున్నాయి.. ముఖ్యంగా కేంద్రంలో అధికారం ఉండే బిజెపితో పొత్తు పెట్టుకుని మరి ఎన్డీఏ కూటమిగా టిడిపి జనసేన కలిసి సైతం వస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో 6 mp సీట్లలో పోటీ చేస్తున్న బిజెపి ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయం పైన చాలా ఉత్కంఠత నెలకొంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి 6సీట్లను తీసుకుంది..టిడిపి 17 సీట్లు పోటీ చేస్తోంది అలాగే జనసేన రెండు సీట్లను తీసుకుంది



అయితే ఇందులో టీడీపీ 13 ఎంపీ సీట్లను నిన్న ప్రకటించారు.. మరో నాలుగు స్థానాలలో మిగిలిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా జనసేన మచిలీపట్నం కాకినాడ సీట్లలో నిలబడబోతోంది.. బిజెపి ఇంకా తమ 6 స్థానాలను ప్రకటించాల్సి ఉన్నది.. మిగిలిన సీట్లలో విజయనగరం, కడప, రాజమండ్రి, అరకు, ఒంగోలు, తిరుపతి, అనంతపూర్ రాజంపేట ఉన్నాయి. ఇందులో 6 బిజెపి సీట్లు సైతం తీసుకోవాల్సి ఉన్నది..


ఇలా 6 సీట్లు తీసుకుంటున్న బిజెపి పార్టీ మోడీ 400 సీట్ల వస్తాయని కలలు కంటున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని గమనిస్తే అది సాధ్యం కాకపోవచ్చునే వార్తలు జాతీయ సర్వేలు తెలియజేస్తున్నాయి.. ఇప్పటివరకు వెలుపడ్డ ఎలాంటి సర్వే కూడా బిజెపికి ఆంధ్రాలో ఆరు సీట్లు వస్తాయని ఎక్కడ చెప్పలేదు..ఈ సమయంలో nda కూటమి అత్యధికంగా ఎంపీ సీట్లు వస్తాయని మాత్రమే చెబుతున్నాయి.. టిడిపి జనసేన వీటివల్ల లబ్ది పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నామ మాత్రం ఓటు బ్యాంకు కలిగి ఉన్న బిజెపి 6 ఎంపీ సీట్లు స్థానాలు గెలవడం అంటే దాదాపుగా 42 అసెంబ్లీ సీట్లు టిడిపి జనసేన ఓట్లు బిజెపి పార్టీకి పడాల్సి ఉన్నది ఇది ఆశా మాశీ విషయం కాదని పలు రకాల సర్వేలు తెలుపుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే బిజెపికి సీట్లు గండి పడే అవకాశం ఉన్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: