543 స్థానాలకు గాను బిజెపి పార్టీ 323 నుంచి 326 స్థానాలను దక్కించుకుంటుందని జన్మత్ సర్వే తెలిపింది.. కాంగ్రెస్ పార్టీ 44 నుంచి 46 స్థానాలు దక్కించుకుంటుందట.. ఇక ప్రాంతీయ పార్టీలలో పశ్చిమబెంగాల్లో తృణమాల కాంగ్రెస్.. 21 నుంచి 23 లోక్సభలను గెలుచుకుంటుందట. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 7 నుంచి 8 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందట . ఒడిస్సాలో అధికార బీజేడి 10 నుంచి 11 లోక్సభ స్థానాలను దక్కించుకుంటుందంటూ తెలియజేశారు. దేశవ్యాప్తంగా మాత్రం ఎన్డీఏ హవానే కనిపిస్తోందని తెలుస్తోంది.
ఇక ఆంధ్ర విషయానికి వస్తే కాస్త ఈ సర్వేలో బిజెపి వెనుకబడినట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన బిజెపి కూటమిగా వచ్చిన 5 నుంచి 7 లోక్ సభ స్థానాలకి పరిమితం కాబోతున్నాయి.. దీంతో మరొక సారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వేలు తెలియజేస్తున్నాయి. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన అధికారికంగా వైసిపి పార్టీకి 105 సీట్లు వరకు గెలిచే అవకాశం ఉంటుందట.. అయితే గతంలో కంటే వైసీపీ పార్టీకి లోక్సభ స్థానాలు కాస్త తగ్గాయని సర్వేలు ప్రకటిస్తున్నాయి. వైసిపి శ్రేణులు మాత్రం ఈ సర్వే ని నమ్ముతూ ఉంటే కూటమి మాత్రం ట్రోల్ చేస్తున్నాయి.