ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది.. ప్రజలను మమేకం చేసుకునేందుకు పలు రాజకీయ పార్టీ అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు.నరసరావుపేట బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు తన నియోజకవర్గ ముస్లిం సోదరులను కలిసి కూటమి ప్రభుత్వం రాగానే చేసే పలు హామీ లు తెలియజేయడం జరిగింది. ముస్లిం సోదరులను తాము అన్ని రకాలుగా ఆదుకుంటామని వారు తెలియజేశారు.తాజాగా టీడిపి, జనసేన, బిజెపి కూటమి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ముస్లిం సోదరులను కలిసి... ముస్లిమ్‌ మైనార్టీలు అపోహలు నమ్మొద్దని,ముస్లిముల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉందని తెలిపారు.పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం గుంటూరు రోడ్డు లోని టిడిపి కార్యాలయం లో మంగళవారం ముస్లిములతో ఆయన సమావేశమ య్యారు.

టిడిపి హయాం లో మైనార్టీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. శాసన మండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ ను కూడా దూషించారని చెప్పారు. 'నారా హమారా - టిడిపి హమారా' అంటూ ముస్లిం నేతలు చంద్రబాబు నాయుడిని అక్కున చేర్చుకున్నారని చెప్పారు.దుల్హన్‌ పథకం, రంజాన్‌ తోఫా మరియు షాది ముబారక్‌ వంటి పథకాలను రద్దు చేసిన మైనార్టీ వ్యతిరేక వైసిపి అని, ఆ పార్టీ చేసే అసత్య ప్రచారాలను అస్సలు నమ్మొద్దని కోరారు. నరసరావుపేట లో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు మసీదు విషయంలో ప్రశ్నించిన ముస్లిం సోదరుడు ఇబ్రహీంను హత్య చేయించారని విమర్శించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలో కి వచ్చాక ముస్లిములకు మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వారు చెప్పారు. మైనార్టీలంతా అపోహలు వీడాలని, ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపికి కూటమికి అండగా నిలవాలని తన గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు.నరసరావుపేట లో  టీడీపీ జెండా ఎగరేయాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: