సీఎం జగన్ తన ప్రసంగాలతో ప్రజలను ఉత్సాహపరచడంతో పాటు, ప్రజలకు ధైర్యం కూడా ఇస్తున్నారు. ఆయన పాలనలో ప్రజల నుంచి ఫిర్యాదులు లేకపోవడం గమనార్హం. ప్రజలు జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఆయనకు నైతిక మద్దతు ఇస్తున్నారు. ఈ యాత్ర నంద్యాల జిల్లాలో కూడా సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. సీఎం జగన్ సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభలో లక్షకు పైగా ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆపై రాత్రికి స్థానిక ఫంక్షన్ హాల్ సమీపంలో విడిది చేసుకుంటారు. ఈ యాత్ర ప్రజలలో, పార్టీ కార్యకర్తలలో ఎంతో ఉత్సాహం నింపుతుంది.
ఈ యాత్ర ప్రారంభానికి ముందు జగన్ కర్నూలు జిల్లా సిద్ధమా అని ఒక ట్వీట్ చేసి గూస్‌బంప్స్ తెప్పించారు. ఈరోజు యాత్ర కర్నూలు పార్లమెంటు పరిధిలో జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానికులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడనున్నారు. లోకల్ లీడర్స్ తో పాటు ముఖ్యమైన కార్యకర్తలను కలిసి వారితో సమీక్షా సమావేశాన్ని చేపట్టే అవకాశం కూడా ఉంది.
వైసీపీ ఎన్నికల ప్రచార సభలో భాగంగా, సీఎం జగన్ ఎలాంటి వాగ్దానాలు చేయనున్నారు అని ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు చాలా ఎక్కువగా ఉన్నారు. సో, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాల దిశగా సీఎం జగన్ ముందడుగు వేసే అవకాశం ఉంది. టెక్స్‌టైల్ పార్కులు, ఇతర కొత్త పథకాలకు జగన్ శ్రీకారం చుట్టవచ్చు, వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతుగా సహాయం చేయవచ్చు. కర్నూలు జిల్లా వాసుల నుంచి ఈ బస్సు యాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే జగన్ వార్ వన్ సైడ్ చేసినట్లే స్పష్టం అవుతుంది.