కొద్ది నెలలకు ముందు ఆయన వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. మరోసారి ఆయనకు పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున సీటు ఇవ్వడం విశేషం. విచిత్రం ఏంటంటే వైసీపీ నుంచి జనసేన కండువాలు కప్పుకున్న ముగ్గురు నేతలకు పవన్ కళ్యాణ్ సీట్లు ఇవ్వడం విశేషం. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి తో పాటు తిరుపతి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అరణి శ్రీనివాసులు సైతం వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అరణి శ్రీనివాసులు ప్రస్తుతం వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పార్టీ మారిన వెంటనే జగన్ ఆయనకు ఏకంగా తిరుపతి సీటు ఇచ్చేశారు.
అలాగే కొద్ది రోజుల క్రితం వైసీపీని వీడిన తాజా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయనకు విశాఖ సౌత్ నియోజకవర్గ దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లే కావడం విశేషం. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన నేతలకు మొండి చేయి చూపించిన పవన్ కళ్యాణ్ అటు టిడిపి నుంచి వచ్చిన నేతలకు.. ఇటు అధికార వైసీపీ నుంచి వచ్చిన నేతలకు సీట్లు కేటాయించడంతో పవన్ అభిమానులు.. జనసేన అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు.
అయితే వారి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకునే పవన్ తనకు ఇష్టం వచ్చినట్లుగా.. తనకు నచ్చిన వారికి సీట్లు కేటాయిస్తూ వెళ్ళిపోతున్నారు. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి.. అసహనం వ్యక్తం అవుతుంది.