సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు టిడిపి అభ్యర్థుల నియమాలను తుది జాబితా నిన్నటి రోజున రిలీజ్ చేశారు.. దీంతో అభ్యర్థుల నియమం ఇంతటితో పూర్తి అయింది.. ఇండియన్ హెరాల్డ్ తెలుపుతున్న సమాచారం మేరకు అనంతపూర్ జిల్లాల రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఒక ఎంపీ స్థానం అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.. అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ ను ఎంపిక చేశారు...

1). అంబికా లక్ష్మీనారాయణ-అనంతపురం:
ఈయన అంబికా గ్రూప్ ఆఫ్ వర్క్ కు అధినేత..2009 లో ఈయన సాధారణ ఎన్నికలలో పోటీ చేశారట. గతంలో టిడిపి పార్టీ హయాంలో కూడా ఆహుడా చైర్మన్ గా పని చేశారు. అలాగే రోటరీ క్లబ్ సభ్యులుగా మాజీ ఉపాధ్యక్షుడుగా పనిచేశారు.

2). దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్-అనంతపురం అర్బన్:
ఇండియన్ హెరాల్డ్ కు అందిస్తోన్న కథనం మెరకు ఈ అభ్యర్థి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు.. రాప్తాడు మండలంలో M. బండమీదపల్లిలో జన్మించారు.2014-19 వరకు రాప్తాడు మండల అధ్యక్షుడుగా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ చాంబర్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారట. స్వగ్రామంలో కూడా ప్రజలకు ఎన్నో సేవలను కూడా చేశారు. ఈయన బీటెక్ మెకానికల్ వరకు చదువుకున్నారు.


3). గుమ్మనూరు జయరాం-గుంతకల్లు:
ఇండియన్ హెరాల్డ్  కు దొరికిన సమాచారం మెరకు ఈ అభ్యర్థి కర్నూలు జిల్లాలోని చిప్పగిరి మండలంలో జన్మించారు..2006 లో అక్కడి నుంచే ZPTC గా ఎంపికయ్యారు..2009 లో ప్రజా పార్టీ తరఫున పోటీ చేసి గెలవలేదు..2014 లో వైసీపీలోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.. 2019లో కూడా మళ్లీ గెలిచి కార్మిక శాఖ మంత్రిగా కొనసాగారు.. ఈసారి టికెట్ రాకపోవడంతో టీడీపీలోకి చేరారు. గుమ్మనూరు జయరాం SSLC చదివారు.

4). కందికుంట వెంకటప్రసాద్: కదిరి
ఇండియన్ హెరాల్డ్ కు అందుతున్న సమాచారం మేరకు ఈ అభ్యర్థి 2004లో అసెంబ్లీ ఎన్నికలలో కదిరి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేశారు.అక్కడ ఓడిపోయారు.. ఆ తర్వాత 2009న టిడిపి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇక 2014, 2019 లో టిడిపి అభ్యర్థిగా నిలబడి ఓడిపోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: