ప్రస్తుతం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఏపీలోని రాజకీయ నాయకులందరూ కూడా ఫుల్ బిజీగా మారి పోయారు. ఇక తమ నియోజకవర్గం లో గెలుపే లక్ష్యంగా ప్రచారం లో దూసుకుపోతున్నారు అని చెప్పాలి. ఏకంగా ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు ఎన్నో హామీలను కూడా ప్రకటిస్తూ ఉన్నారు . అదే సమయంలో ఇక అన్ని పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

 టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు అధికారంలో ఉన్న వైసీపీ ఫై తీవ్రస్థాయిలో విమర్శలకు గుప్పిస్తున్నాయి. ప్రచారంలో జగన్ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. అదే సమయంలో అటు వైసీపీ సైతం మిగతా పార్టీలకు గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు. కాగా ఇటీవలే ప్రచారంలో భాగంగా వైసిపి తనను ఓడించడానికి కక్ష కట్టింది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.



 అయితే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అధికార వైసిపి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఇచ్చిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసిపి.. నిన్ను ఓడించడానికి మేము అవసరం లేదు నీ పక్కన ఉన్నాడు. చూడు పసుపు చొక్కా వేసుకొని ఆయన నిన్ను ఓడిస్తాడు. నీ మీద కక్ష కట్టింది కూడా మేము కాదు. మీ దత్తతండ్రి అయిన చంద్రబాబు.. టేక్ కేర్ అంటూ ఒక పోస్ట్ పెట్టింది వైసిపి. అయితే ఇలా పవన్ ప్రచారం నిర్వహించిన సమయంలో.. పవన్ పక్కనే టిడిపి నేత వర్మ నిలబడి ఉండగా.. ఆ వర్మే నిన్ను ఓడిస్తాడు అంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: