టాలీవుడ్ లో ఎందరో నటి నటులు ఒక్క ఇండస్ట్రీలోనే కాకుండా తమ వంతు ప్రజలకు సహాయం చేద్దాం అనే మంచి ఆలోచనలతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే అలా వచ్చిన వారిలో నటుడు అలీ కూడా ఉన్నారు. ఆయన గత ఎన్నికల ముందు వైసీపీ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లోనే పార్టీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం కూడా చేసారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని ప్రచారం బాగా జరిగింది కానీ చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరలా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనను వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా టికెట్ వస్తుందని చాలా మంది భావించారు. కానీ సమీకరణాలను బేస్ చేసుకుంటే ఆయనకి టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదు.

మొదట్లో ఆయన్ను నంద్యాల లేదా గుంటూరు పార్లమెంట్ స్థానాలకు అలీ పేరును ఖరారు చేసే యోచనలో వైసీపీ అధిష్టానం చూసింది.కానీ అలీకి ఈ ఎన్నికల్లో కూడా సీటు దక్కని పరిస్థితి ఎదురైంది. అయితే అలీని జగన్ రాజ్యసభకు పంపిస్తారని అంతా అనుకున్నారు.కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరులో సీఎం జగన్ మాట్లాడుతూ కర్నూల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఐనా హఫీజ్‌ పాషాకు కొన్ని అనివార్య కారణాల వల్ల సీటు ఇవ్వలేకపోయామని కచ్చితంగా రెండేళ్ల తర్వాత హఫీజ్‌ పాషాను రాజ్యసభకు పంపిస్తానని జగన్‌ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.

అయితే ఈ హామీ వల్ల అలీ కి ఆ ఒక్క హోప్ కూడా మిస్ అయిందని అతని వర్గాలు చెప్పుకుంటున్నాయి.వైసీపీకి మద్దతు పలికిన ఇండస్ట్రీవాళ్లలో అలీ ఫస్ట్ లైన్ లో ఉంటారు. అలాంటి వ్యక్తికీ జగన్ నమ్మించి మోసం చేసాడనే కొంతమంది అంటున్నారు. చివరికి అలీ రాజకీయ జీవితంపై ఇపుడు చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అయితే దీనిపై అలీ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: