ఇక మెగా ఫ్యామిలీలో మరో సోదరుడు నాగబాబు కూడా 2019లో ఇదే జిల్లాలోని నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇలా సొంత జిల్లా.. సొంత ప్రాంతం... నుంచి ముగ్గురు మెగా బ్రదర్స్ పోటీ చేసినా కూడా విజయం సాధించలేకపోయారు. అయితే ఈ
ఎన్నికలలో మెగా బ్రదర్స్ సొంత నియోజకవర్గ అయిన నరసాపురంలో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి జనసేన తరఫున బీసీ వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేసిన ఆయన గట్టి పోటీ ఇవ్వడంతో పాటు కేవలం 5000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇప్పుడు ఇక్కడ ఆయన మరోసారి పోటీలో ఉండడంతో సానుభూతితో పాటు అటు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో కుటుంబ పరిచయాలు.. బంధుత్వాలు, స్నేహాలు, మెగా ఫ్యామిలీ వీరాభిమానులు, కాపు సామాజిక వర్గ ఓటర్లు, యువత.. ఇటు బీసీ వర్గాలు అటు శెట్టిబలిజ వర్గాలు అందరూ ఏకం అవుతున్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు మంత్రి పదవి వస్తుందన్న ఆశలతోనే ఐదేళ్లు గడిపేశారు. ఆయన వల్ల నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి లేదు. అలా అని పెద్దగా చెప్పుకోదగ్గ వ్యతిరేకతకు కూడా లేదు.
జనసేన బీసీలకు ఇవ్వడంతో ఇక్కడ వైసీపీ సీటు కాపులకు ఇస్తుందన్న ప్రచారం జరిగినా రాజులకే ఇచ్చారు. ఈ సారి రాజుల్లోనే వైసీపీ పట్ల సానుభూతి లేదు. ఇక మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరడం కూడా కూటమి క్యాండెట్‌కు చాలా ప్లస్. టిడిపి + జనసేన ఓటు బ్యాంకు కలిపితే తక్కువలో తక్కువగా ఇక్కడ నుంచి జనసేన 20,000 మెజార్టీ... గాలి బలంగా వీస్తే 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా సొంత ప్రాంతంలో పవన్ పార్టీ పాగా వేసి రికార్డు క్రియేట్ చేయడం ఖాయమైనట్టే..!