ప్రస్తుతం వైఎస్ఆర్ కంచుకోట కడప జిల్లాలో రాజకీయాలు  మరింత ఆసక్తికరంగా మారాయి. తమ కంచుకోటలో ఫస్ట్ టైం వైఎస్ ఫ్యామిలీ రెండుగా చీలి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. కడప జిల్లాలో, కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది.ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వైఎస్ షర్మిళ.. తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రధానంగా ప్రత్యేక హోదా పేరు చెప్పి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆమె షాకింగ్ చేశారు. ఈ సమయంలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆమె కడప నుంచి బరిలోకి దిగాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది. అందుకే ఫస్ట్ టైం వైఎస్ ఫ్యామిలీ రెండుగా చీలి పోటీ చేస్తున్న ఎన్నిక కావడంతో... కడపలో ఆమె ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.కడప లోక్ సభ స్థానానికి వైసీపీ నుంచి షర్మిళ తమ్ముడు వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో అవినాష్ టార్గెట్ గా షర్మిళ బరిలోకి దిగుతున్నారని అంటున్నారు. దీంతో ఆమె లోక్ సభ కు పోటీ చేస్తే.. ఆ ప్రభావం ఆ పరిధిలోని 7 నియోజకవర్గాలపైనా పడే అవకాశం ఎంత అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కడపలో షర్మిళ ఎంపీగా పోటీ చేస్తే... ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కడప, పులిఎందుల, బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశాలున్నాయనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.ఈ నియోజకవర్గాల్లోనూ పులివెందులలో షర్మిళ అన్న జగన్ పోటీ చేస్తుండగా.. కమలాపురంలో షర్మిల సొంత మేనమామ అయిన రవీంద్రనథ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో... కడప లోక్ సభ స్థానం విషయంలో జనాలు జగన్ ని కాదని షర్మిళను నమ్మితే మాత్రం ఆ  నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి చూడాలి వై ఎస్ ఆర్ ఫ్యామిలీ కంచుకోటాలో విజయం ఎవరిని వరిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: