తాజాగా ఇలాంటి సంఘటనే జరుగుతుంది పిన్నెల్లి అనే గ్రామంలో. పిన్నెల్లి, పల్నాడు జిల్లాలోని మాచవరం మండలానికి చెందినది ఈ గ్రామం. ఇది మండల కేంద్రమైన మాచవరం నుండి 5 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 20 కి.మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం మాచర్ల నియోజక వర్గం కిందకి వస్తుంది.అక్కడ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి పై గెలిచారు. అలాగే 2024 లో జరగబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి పై టీడీపీ అభ్యర్థి జులకంటి బ్రాహ్మనందరెడ్డి బరిలో ఉన్నారు.
ఇక్కడ ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంటున్నది. అదేంటంటే ఇక్కడ ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్లు మాత్రమే మెజారిటీగా ఆ ఊరిలో ఉంటారు.మిగిలిన వాళ్లు ఆ ఊరు వదిలి వెళ్తుంటారు.ఎందుకంటె అలా గెలిచినా వాళ్ళల్లో కొంతమంది వేరే వాళ్ళని రెచ్చగొట్టి గొడవలకి దిగేలా చేస్తారు చివరికి అది ఎక్కడిదాకాపోతుంది అంటే నాన్ బెయిల్ కేసులు దాక పోటుంది. ఒక్కోసారి చంపుకునేదాకా పోతుంది.కనుక అలా వెళ్లిన వాళ్లు వేరే వేరే ప్రాంతాలకు పోయి మరలా ఎన్నికల వేళ వస్తుంటారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక దాదాపు అరవై కుటుంబాలు వెళ్ళిపోయాయి.