తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్ వైసీపీ టికెట్ ఇవ్వడం వల్లే తాను తట్టుకోలేక.. కడప ఎంపీ బరిలో దిగుతున్నానంటూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలియజేసింది. ఇండియా హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు కడప నుంచి షర్మిల పోటీ చేయబోతోంది.. అలాగే బాపట్ల నుంచి జెడి శీలం , సింగనమలలో శైలజనాథ్.. ఇలా వరుస పెట్టి పోటీ చేస్తున్నవారు.. ఇప్పటికే చాలామంది మాజీ కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి వారు పోటీ చేయబోతున్నారు.
ఇండియా హెరాల్డ్ కు అందుతున్న సమాచారం.. మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అవి కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాయి.. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఓటు చీల్చినా... ఇందులో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు సైతం టిడిపి, జనసేన, బిజెపికి వెళ్తాయి.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఓట్లను చీల్చడానికి షర్మిలను టిడిపి ప్రోత్సహిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. జగన్ కి అనుకూలంగా లేకపోతే రాజశేఖర్ రెడ్డి కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా ఉంటారు.. ఇలా కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్ని ఓట్లు సాధిస్తారో.. అన్ని ఓట్లు జగన్ కు మైనస్ గా మారుతాయి.. ముఖ్యంగా ఇలాంటి ఓటర్లు అందరూ కూడా టిడిపి పార్టీకి ఓటు వేయరు.. అందుకే ఇలాంటి ఓట్లను షర్మిలాకు బదిలీ అయ్యేవిధంగా ప్లాన్ తోనే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జగన్ ఓటమిని ఖాయం చేసే విధంగా.. అటు షర్మిల ఇటు చంద్రబాబు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది..