![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/raju-ravi-raju-pawan-kalyan-video7b171a7e-1436-44cc-9356-3e87c0537316-415x250.jpg)
పార్టీ కోసం , పార్టీ బాగు కోసం ఎన్నో ఆలోచనలు చేశాను.. అందులో ఒకటి కూడా పవన్ అమలు చేయలేదు.. పవన్ కళ్యాణ్ లో వివేకం చచ్చిపోయింది.. వివేకం నశించడంతోనే మనిషి నాశనం మొదలవుతుంది.. ఒకప్పుడు పవన్ జీవితంలో పాండిత్యం, జ్ఞానం, మంచితనం, దయా, కరుణ మాత్రమే ఉండేవి.. కానీ ఇప్పుడు కుట్ర , మోసం, ద్వేషం, అబద్దాలు నిండిపోయాయి.. ప్రస్తుతం అపద్ధపు బ్రతుకు బ్రతుకుతున్నాడు అంటూ విమర్శించారు.. ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాము.. మీరే ఆ వ్యాధిగా మారారు.. ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, పార్టీకి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉండమని కోరారు.. దాదాపు 12 ఏళ్లు మీ వెంటే నడిచాను.. పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు మీతో చర్చించాను.. కానీ మీ రాజకీయాలు విషపూరితంగా మారాయి.. కులాలు, మతాల ప్రస్తావన తీసుకొచ్చి అబద్దాలు, అసభ్యకర భాషతో మాట్లాడుతున్నారు.. ఇక పొత్తు పెట్టుకోవడం వల్ల మీరు ఇంకా దరిద్రంగా మారిపోయారు అంటూ విమర్శించారు రాజు రవితేజ.. ఇకపోతే తన ప్రాణ స్నేహితుడైన పవన్ కళ్యాణ్ తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించి తన జీవితాన్ని కూడా నాశనం చేశారంటూ కూడా విమర్శించారు రాజు రవితేజ..
.