ముందుగా వీరిలో సీనియర్ అయిన వంగా గీత విషయానికి వస్తే ఆమె టీడీపీ నుంచి రాజకీయాలు స్టార్ట్ చేశారు. టీడీపీ నుంచి ఆమె రాజ్యసభ సభ్యురాలిగా, జడ్పీచైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆమె అనూహ్యంగా కాకినాడ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు వైసీపీ నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తూ స్టేట్‌లోనే సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ అయ్యారు.
ఇక కొత్తపల్లి గీత విషయానికి వస్తే ఆర్డీవోగా ఉన్న ఆమె 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి అరకు ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత ఆమె టీడీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీకి దగ్గరైన గీత తాజా ఎన్నికల్లో అరకు పార్లమెంటు సీటు నుంచి బీజేపీ తరపున కూటమిలో భాగంగా పోటీ చేస్తున్నారు.
ఇక టీడీపీ మీసాల గీత విషయానికి వస్తే విజయనగరం నియోజకవర్గానికి చెందిన ఆమె ముందు ప్రజారాజ్యంలో పనిచేశారు. తర్వాత 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఆమెకు సీటు రాలేదు. ఈ సారి కూడా మీసాలకు సీటు రాలేదు. దీంతో ఆమె తనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని టీడీపీ అధిష్టానానికి సవాళ్లు రువ్వుతున్నారు. మరి మీసాల గీత కోరిక తీరుతుందో ? లేదో ? చూడాలి.