ఇక తా జా ఎన్నికల్లో వెలగపూడి నాలుగో సారి పోటీ చేస్తుంటే వైసీపీ నుంచి ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ . సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గానికి ఇద్దరూ నాన్ లోకల్.. ఇద్దరూ సెటిలర్స్.. పైగా ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికే చెందిన నేతలు. అయితే ఈ సారి వెలగపూడిలో ధీమా ఎక్కువైందంటున్నారు. ఆయన పది రోజుల నుంచే జనాల్లోకి వెళుతున్నారు. ఎంవీవీ మాత్రం గత ఏడెనిమిది నెలల నుంచే విస్తృతంగా జనాల్లో ఉండడంతో పాటు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.
ఆర్థికంగా చూస్తే ఎంవీవీతో పోలిస్తే వెలగపూడి వీకే అంటున్నారు. వెలగపూడి కాస్త రిలాక్స్ , నిర్లక్ష్య మైన మోడ్‌లో ఉంటే ఎంపీవీ మాత్రం చాపకింద నీరులా జోరు చూపిస్తూ వెళుతున్నారు. గత మూడు ఎన్నికల్లోనూ టీడీపీ వెలగపూడికి వన్ సైడ్‌గా పట్టం కట్టిన విశాఖ తూర్పు ఓటరు ఈ సారి మాత్రం అంత ఈజీగా ఆయన్ను గెలిపించే పరిస్థితి లేదు. వెలగపూడి చాలా జాగ్రత్తగా ఎన్నికలను ఎదుర్కొని పోల్ మేనేజ్ మెంట్ చేసుకోక ఇలాగే ఉంటే తూర్పులో ఈ సారి కొత్త ఎమ్మెల్యేను చూడొచ్చు..!