ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు కూడా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బంగపాటుకు గురైన బిఆర్ఎస్ కనీసం పార్లమెంటు ఎన్నికల్లో అయిన సత్తా చాటాలని అనుకుంటుంది. ఇక మోడీ మేనియాతో పార్లమెంటు ఎన్నికల్లో మాకు మెజారిటీ స్థానాల్లో విజయం ఖాయమని బిజెపి బలంగా నమ్ముతుంది.


 అయితే తెలంగాణ లో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉండగా ఇక మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పైనే అన్ని పార్టీల ప్రత్యేకమైన దృష్టి ఉంది. హైదరాబాద్ నగరానికి తూర్పు వైపున ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపును ఇక అన్ని పార్టీలు కూడా ఎంతో సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటివరకు బిఆర్ఎస్, బిజెపి పార్టీలో బోని కొట్టలేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పాటైన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరిగగా.. ఏకంగా రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి టిడిపి ఆ స్థానంలో విజయం సాధించాయి.



 ఒకరకంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కంచుకోట అని కూడా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. ఇప్పటికే మూడు ఎన్నికల్లో రెండుసార్లు విజయకేతనం ఎగరేసిన కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి ఈ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగర వెయ్యాలని పట్టుదలతో ఉంది. అయితే గత ఎన్నికల్లో ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడం ఇక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో మల్కాజిగిరిలో విజయం కాంగ్రెస్కు మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. దీంతో ఇక 17 పార్లమెంటు స్థానాలలో  గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్న రేవంత్.. ఇక మల్కాజ్గిరి విజయం పైన మాత్రం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు అన్నది తెలుస్తుంది.


కాగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టు ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. అంతేకాదు ఈ నియోజకవర్గానికి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇన్చార్జిగా నియమించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది హస్తం పార్టీ. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. అదొక్కటే కాంగ్రెస్ మైనస్ అవ్వబోతుంది అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: