ఆళ్ల నానిని అభ్యర్థిగా మార్చమని అక్కడి నేతలు చెప్పిన అక్కడ వేరే అభ్యర్థి లెకపొవడంతో అతనికే టికెట్ దక్కింది.మంత్రిగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలే అతన్ని ఒదించేందుకు పునాదులుగా మారాయి అనిసొంత నేతలే అంటున్నారు.అధికార మదంతో అక్కడ ఒక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ పై ఉక్కుపాదం మోపారని ప్రజలు అంటున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి బుచ్చి మరణంతో అతని కుటుంబానికి చెందిన బడేటి చంటికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది.ఆయన నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉంటూ అందరిని కలుపుకు పోతు మంచి పేరు తెచ్చుకుంటున్నారు.టీడీపీ నాయకులు కూటమితో కలిసి దూసుకుపోతున్నారు.చాలా మంది వైసీపీ నేతలు ఆళ్ల మీద ఉన్న వ్యతిరేకతతో టీడీపీలో చేరుతున్నారు. దాంతో ఈసారి ఏలూరులో టీడీపీ జండా ఎగరడం మాత్రం కచ్చితంగా జరుగుతుంది అని అక్కడి ప్రజలు అంటున్నారు.