21 స్థానాలలో కూటమి పైచేయి సాధించే ఛాన్స్ ఉందని మిగిలిన 15 స్థానాలలో వైసీపీ విజయం సాధించనుందని సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఎస్సీ నియోజకవర్గాల్లో 19 సీట్లలో కూటమికి అనుకూల పరిస్థితులు ఉండగా 10 స్థానాలలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎస్టీ నియోజకవర్గాల విషయానికి వస్తే 5 నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉండగా రెండు నియోజకవర్గాల్లో మాత్రం కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.
ఈ సర్వే ఫలితాలు నిజమైతే మాత్రం కూటమి సులువుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో తమ పార్టీకే అనుకూలంగా ఫలితాలు వస్తాయని భావించిన వైసీపీకి ఈ సర్వే ఫలితాలు ఒకింత షాక్ అనే చెప్పాలి. రాష్ట్రంలో ఎన్నికల హీట్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రధాన రాజకీయ పార్టీలు సర్వేల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి.
జగన్ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలపై వైసీపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తుందని భావించిన ఓటర్లకు నిరాశే ఎదురైంది. అందువల్ల ఈ ఎన్నికల్లో వైసీపీకి రిజర్వ్డ్ స్థానాలలో గెలుపు సులువు కాదని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు బెనిఫిట్ కలిగేలా వైసీపీ ఏవైనా హామీలను ప్రకటిస్తే బెటర్ అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. సర్వేల ఫలితాలు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో జగన్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.