ఇదిలా ఉండగా మరోవైపు రఘురామ కృష్ణంరాజు వైసీపీలో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. వైసీపీ నీ విమర్శిస్తూ వచ్చిన వైసీపీకి రాజీనామా చేస్తారు అంటూ వార్తలు వినిపించాయి అన్నట్టుగానే వైసిపికి రాజీనామా చేశారు రఘురామకృష్ణరాజు .. ఇక తాజాగా టిడిపిలోకి చేరడంతో.. టిడిపి అధినేత చంద్రబాబు రఘురామకృష్ణను టిడిపిలోకి ఆహ్వానించి కండువా కప్పి టికెట్ కన్ఫర్మ్ చేశారు.. ఉండి నియోజవర్గాన్ని రఘురామ కృష్ణరాజుకు కేటాయించినట్లు తెలుస్తోంది.. ఎంపీగా గెలిచిన ఈయన ఐదేళ్లు వైసీపీకి దూరంగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత టిడిపిలో చేరారు.. టికెట్ ఆశించి దక్కకపోవడంతో ఆయన గడచిన శుక్రవారం రోజున టిడిపి పార్టీలో చేరారు.
దళిత ఎంపీగా పోటీ చేస్తారని అందరూ అనుకున్నప్పటికీ అది కన్ఫామ్ కాలేదు.. టిడిపి నుంచి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఏకంగా సిద్ధమయ్యారు. 2019లో నరసాపురం ఎంపీగా వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఈయన ఆ తర్వాత కొన్ని పరిణామాలతో వైసిపి పార్టీకి దూరమయ్యారు. అలా ఎన్నోసార్లు వైసీపీ పార్టీని విమర్శించారు. తాజాగా నిన్నటి రోజున ఉండి నియోజవర్గంలో రామరాజు మద్దతుదారులు నిరసనలు తెలియజేస్తున్నారు.. ఉండి టికెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టిడిపి అధినేత చంద్రబాబు కన్ఫామ్ చేశారు.. దీంతో ఆయన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు ఇవ్వడంతో చాలామంది నేతలు అసంతృప్తిని తెలుపుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రామరాజు టికెట్టుని లాక్కోవడంతో అసమ్మతి ఛాయలు నెలకొన్నాయి.