•ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టేనా..
•షర్మిల రాజకీయాలలో పావుగా మారనుందా..
(కడప - ఇండియా హెరాల్డ్ )
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా వైఎస్ షర్మిల రెడ్డి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అయితే తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీ పార్టీకి ఎంతో అండగా నిలిచి 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి తన వంతు కృషి చేసింది.. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణ మేరకు సిబిఐ వాళ్ళు 2012లో జరిగిన ఉప ఎన్నికలకు ముందే అరెస్టు చేయగా.. పార్టీని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి బలోపేతం చేసే దిశగా మరో ప్రజాప్రస్థాపన పేరు మీద పాదయాత్రను మొదలుపెట్టి.. 16 జిల్లాల మీదుగా.. 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది.. అలా పాదయాత్రలో భాగంగా 14 జిల్లాల గుండా 116 నియోజకవర్గాలు, 9 కార్పొరేషన్లు, 45 మున్సిపాలిటీలు, 195 మండలాలు, 2,250 గ్రామాలను తాకుతూ ప్రజలలో మమేకం అవుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసింది.. అంతేకాదు ఈ పాదయాత్రలో భాగంగా మొత్తం కోటి మందికి పైగా జనాలను ఆమె ప్రత్యక్షంగా కలిసినట్లు అంచనా కూడా వేశారు. ప్రపంచంలోనే ఇంత దూరం పాదయాత్ర చేసిన మహిళగా కూడా రికార్డు సృష్టించారు షర్మిల..
ఒకప్పుడు అన్న కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన షర్మిల.. ఆ తర్వాత తెలంగాణలో తమ జెండా ఎగురవేయాలనే నేపథ్యంలో "వైయస్సార్ తెలంగాణ పార్టీ"ని స్థాపించింది.. 2021 జూలై 8వ తేదీన ఈ పార్టీని ప్రారంభించి.. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈమెకు మద్దతు ఇవ్వడంతో ఆ తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని.. 2024 జనవరి 4వ తేదీన తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసింది.. తెలంగాణలో పార్టీని స్థాపించినప్పుడు కేసీఆర్ ను గద్దె దించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది.. తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆ పార్టీ విజయానికి కూడా ఈమె సహాయం చేసింది.
కట్ చేస్తే మళ్లీ ఆంధ్రా వైపు మళ్ళిన షర్మిల.. అటు తన అన్న వైసిపి పార్టీకి వ్యతిరేకంగా ఉన్న టిడిపి తో చేతులు కలిపి.. తన అన్నకే పోటీగా కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా పోటీ చేయబోతోంది.. అసలు ఒకప్పుడు అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది.. మరొకవైపు రాజకీయ పార్టీని స్థాపించి దానిని కాంగ్రెస్ లోకి విలీనం చేసింది.. ఇప్పుడు మళ్ళీ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తానని బరిలోకి దిగింది.. కడప జిల్లాలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే.. వైయస్సార్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి పేరు ఉంది.. ఆయన చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలు అక్కడ ప్రజల అభివృద్ధికి తోడ్పడ్డాయి.. అలాంటి జగన్మోహన్ రెడ్డి పై ఈమె నేడు విమర్శలు గుప్పిస్తూ చేస్తున్న వ్యాఖ్యలను అక్కడి ప్రజలు తిప్పి కొడుతున్నారు. తన అన్న జగన్ పైన పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవు.. అసలు ఏ లక్ష్యంతో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిందో అర్థం కావడం లేదు.. తనకంటూ ఒక గమ్యం లేదు.. లక్ష్యం లేదు.. కేవలం అన్న మీద కక్షతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిందనే విషయమైతే తేటతెల్లమవుతోంది.