ఓడిన చోటే గెలవాలన్న ప‌ట్టుద‌ల‌తో టీడీపీ యువ‌నేత‌, మాజీ మంత్రి నారా లోకేష్ ఐదేళ్లుగా మంగ‌ళ‌గిరిని వ‌ద‌ల్లేదు. తాను పుట్టిన ఊరు కాదు.. పెరిగిన ప్రాంతం కాదు.. అస‌లు అక్క‌డ త‌న సొంత సామాజిక వ‌ర్గం కూడా లేదు. క‌నీసం పార్టీ గెలిచే 30 ఏళ్లు అవుతోంది. అలాంటి చోట గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయాడు. అయితే ఈ సారి మంగ‌ళ‌గిరిని వ‌దిలేసి మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ ఓడిపోయిన చోటే గెల‌వాల‌న్న ఆకాంక్ష‌తో లోకేష్ మంగ‌ళ‌గిరిలోనే పోటీ చేసేలా ఐదేళ్ల నుంచి గ్రౌండ్ వ‌ర్క్ చేస్తూ వ‌చ్చారు. 2024 ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానిక 2019లో ఓడిపోయిన మ‌రుస‌టి రోజు నుంచే వర్క్ ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకున్నాడు. నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని వేల మందికి లోకేష్ నుంచి వ్య‌క్తిగ‌త సాయం అందింది.  నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద‌ ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా లోకేష్ తరపున శుభాకాంక్షలు వెళతాయి.

అలాగే ఏ ఇంట్లో ఏదైనా ఇబ్బంది.. విషాదం చోటు చేసుకున్నా లోకేష్ నుంచి భ‌రోసా వెళుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్ని మభ్య పెట్టి వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే బ‌క‌రా అయిపోయారు. ఆయ‌న కాంగ్రెస్ లోకి వెళ్లి తిరిగి వైసీపీలోకి వ‌చ్చినా జ‌నాలు న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు సీటు పోతోంద‌ని క్లారిటీ వ‌చ్చార ఆర్కే ఎస్కేప్ అయిపోయాడు. మ‌ధ్య‌లో బీసీ అంటూ గంజి చిరంజీవిని తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చి ఆయ‌న్ను పీల్చి పిప్పి చేసి ప‌డేశారు.

ఆ త‌ర్వాత మాజీ ఎమ్మెల్యేలు, వియ్యంకులు అయిన మురుగుడు హనుమంతరావు - కాండ్రు కమలపై దృష్టి మ‌ళ్లింది. అటు కమల కుమార్తె..హనుమంతరావు కోడలకు టిక్కెట్ ఇచ్చారు. లోకేష్ సొంతంగా నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని కులాల వారీగా ప్ర‌త్యేకంగా ఉపాధి ఇచ్చారు. యువ‌త అంతా ఆయ‌న వెంటే ఉన్నారు. ఎంతో మంది నిరుపేద‌, పేద‌ల‌కు ఆయ‌న‌కు త‌న వంతుగా ఉపాధి క‌ల్పించారు.

వైసీపీ క్యాండెట్ మురుగుడ‌ లావణ్య గెలుపు బాధ్యతను ఆర్కే తీసుకున్నా కూడా మనస్ఫూర్తిగా పని చేయడం లేద‌ట‌. ఎన్నికల మేనెజ మెంట్, పోల్ మేనేజ్‌మెంట్, బూత్ మేనేజ్ మెంట్.. ఇలాంటి విషయాల్లో నారా లోకేష్ ప్రత్యేకమైన కసరత్తు చేయ‌డంతో ఈ సారి లోకేష్ మెజార్టీ 30 - 50 వేల రేంజ్‌లో ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: