ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అనే ప్రశ్న చాలామంది రాజకీయ నేతలను వణికిస్తోంది. జగన్ మళ్లీ సీఎం అయితే టీడీపీ పరిస్థితి ఏంటని చంద్రబాబు భావిస్తున్నారు. కూటమి అధికారంలోకి రాకపోతే జనసేన పరిస్థితి ఏంటనే టెన్షన్ పవన్ కళ్యాణ్ లో ఉంది. జగన్ ను ఓడించడానికి రామోజీరావు తీవ్రస్థాయిలో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. మరో పచ్చ పత్రిక అధినేత కూడా వైసీపీని ఓడించడానికి తెగ కష్టపడుతున్నారు.
 
అయితే జగన్ గెలిస్తే ప్రధానంగా చంద్రబాబు, పవన్, రామోజీరావు, మరో పచ్చ పత్రికాధిపతి, నిమ్మగడ్డ రమేష్ లను టార్గెట్ చేసే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రం ఇతర పార్టీ నేతలకు చుక్కలే అని కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలను బలహీనపరిచే ఏ అవకాశాన్ని కూడా జగన్ వదులుకోరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కీలక టీడీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. ఈసారి జగన్ కూడా రూట్ మార్చనున్నారని మళ్లీ సీఎం అయితే మరో 20 సంవత్సరాలు రాష్ట్రంలో వైసీపీనే అధికారంలో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. జగన్ సభలకు ఊహించని స్థాయిలో జనం హాజరవుతూ ఉండటం గమనార్హం.
 
పచ్చ పత్రికలు రాస్తున్న తప్పుడు కథనాలు బూమరాంగ్ అవుతున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పచ్చ పత్రికల విష ప్రచారం పార్టీలను ముంచేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రజలకు మంచి చేయడం మరిచి ఇప్పుడు వింత ప్రయత్నాలు చేస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. 2024లో జగన్ గెలిస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ ను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. 115 నుంచి 120 మధ్య వైసీపీకి సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: