- లోకల్ అంశం హైలెట్‌గా దూకుడు
- తండ్రి కరుణాకర్ వేసిన బలమైన పునాది కలిసొస్తోన్న వైనం
( చిత్తూరు - ఇండియా హెరాల్డ్ )
తిరుపతి అసెంబ్లీ స్థానం ఈ సారి.. వారసుడికే.. పట్టం కడుతోందా? ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీలో ఉన్న యువ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్.. అవకాశం కల్పించారు. దీంతో ఇక్కడి ఎన్నికల్లో అభినయ్‌రెడ్డి ఆసక్తిగా నిలిచారు. కాంగ్రె స్‌కు ముందు నుంచి కూడా.. భూమన రాజకీయాల్లో ఉన్నారు. కమ్యూనిస్టు వాదిగా.. ఆయన పేరు తెచ్చు కున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలు.. ప్రజా ఉద్యమాలు వంటివి.. చేశారు.
ఇలా.. అప్పటి కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆకర్షించిన భూమన తర్వాత.. ఈ పార్టీ తీర్తం పుచ్చుకున్నారు... ఒక్కొక్క అడుగుగా ప్రారంభమైన భూమన రాజకీయం.. తర్వాత తారా జువ్వలా పుంజుకుంది. వైఎస్ రాక తో.. ఏకంగా.. భూమన రాజకీయం మేలి మలుపు తిరిగింది. మనసులో ఏది అనుకుంటే.. అది జరిగిపో యింది. అప్పట్లోనే టీటీడీ బోర్డు చైర్మన్‌గా చేశారు. ఒకవైపు ఆయనపై ఆరోపణలు ఉన్నా.. వైఎస్ వాటిని పక్కన పెట్టి మరీ బోర్డు చైర్మన్ పదవిని ఇచ్చారు.
ఇక, వైఎస్ అనంతరం.. జగన్ చెంతకు చేరిన భూమన ఆయన అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నా రు. మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆవేదన తప్ప.. ఇతర విషయాల్లో జగన్ ఈ కుటుంబానికి ఇచ్చిన లిఫ్టింగ్ అంతా ఇంతాకాదు. ఈ క్రమంలోనే తన కుమారుడు అభినయ్‌కు టికెట్ అడగ్గానే ప్రత్యర్థి విషయాన్ని పరిశీలనకు కూడా తీసుకోకుండానే.. జగన్... భూమన వారసుడికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్‌గా అందరికీ సుపరిచితుడైన అభినయ్.. ఇక, ఎమ్మెల్యే బరిలోనూ అంతే దూకుడుతో ఉన్నారు.
కలిసి వస్తున్న అంశాలు..
+ నియోజకవర్గంలో ఇప్పటికే ఒకసారి సుడిగాలి పర్యటన పూర్తి చేశారు.
+ అసంతృప్త నాయకులు లేకపోవడం. భూమనకు ఉన్న ఇమేజ్.
+ కరోనా సమయంలో కరుణాకర్‌రెడ్డి చేసిన సేవలు
+ యువ నాయకుడిగా వైసీపీని గత ఐదేళ్లుగా ముందుకు నడిపిస్తున్న తీరు.
+ స్థానికత అంశాన్నిప్రధానంగా ప్రస్తావించడం.
+ తుడాలో బలమైన నాయకత్వం ఉండడం.
+ వైసీపీ పథకాలు.